అతనొక్కడే.. 11 మంది కెప్టెన్లు.. భారత వెటరన్‌ ఖాతాలో అరుదైన రికార్డు

Dinesh Karthik Played International Cricket Under 11 Captains - Sakshi

ఐపీఎల్ 2022లో సత్తా చాటడం ద్వారా టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన వెటరన్‌ వికెట్‌కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. కెరీర్‌ దాదాపుగా ముగిసిపోయిందన్న దశలో తిరిగి టీమిండియాలో స్థానం సంపాదించిన డీకే.. తన అంతర్జాతీయ కెరీర్‌లో ఏకంగా 10 మంది భారత కెప్టెన్ల కింద ఆడి అరుదైన రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ స్థాయిలో ఓ ఆటగాడు ఇంత మంది కెప్టెన్ల కింద ఆడిన దాఖలాలు లేవు. ఐసీసీ ఈవెంట్లతో కలుపుకుంటే డీకే కెప్టెన్ల సంఖ్య 11కు చేరుతుంది. కార్తీక్‌ పాక్‌ దిగ్గజ ఆటగాడు షాహిద్‌ అఫ్రిది నాయకత్వంలో ఐసీసీ ఎలెవెన్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 

ఇటీవలే  37వ పడిలోకి అడుగుపెట్టిన కార్తీక్‌ త్వరలో అంతర్జాతీయ స్థాయిలో తన కెప్టెన్ల సంఖ్యను 12కు పెంచబోతున్నాడు. కార్తీక్.. త్వరలో ప్రారంభంకానున్న ఐర్లాండ్‌ పర్యటనలో హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీలో ఆడబోతున్నాడు. 18 ఏళ్ల క్రితం 2004లో తొలిసారి టీమిండియా తరఫున ఆడిన కార్తీక్‌.. తన అరంగేట్రం మ్యాచ్‌లో సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో ఆడాడు. ఆ తర్వాత రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్‌, ఎమ్మెస్ ధోని, అనిల్ కుంబ్లే, సురేష్ రైనా, అజింక్య రహానే, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రిషబ్‌ పంత్‌ల కెప్టెన్సీల్లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. 
చదవండి: ఒకే జట్టులో కోహ్లి-బాబర్, బుమ్రా-అఫ్రిది‌..?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top