బెయిర్‌ స్టో దూరం

Delhi Won The Toss And Elected To Field First Against SRH - Sakshi

సన్‌రైజర్స్‌ గెలిస్తేనే..!

దుబాయ్‌: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన ఢిల్లీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌.. ముందుగా సన్‌రైజర్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ సీజన్‌లో ఇరుజట్ల మధ్య జరిగిన తొలి అంచె మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో డేవిడ్‌ వార్నర్‌(45), జోనీ బెయిర్‌ స్టో(53)లు రాణించడంతో పాటు బౌలింగ్‌లో రషీద్‌ ఖాన్‌ 14 పరుగులిచ్చి 3 వికెట్లు సాధించడంతో సన్‌రైజర్స్ విజయాన్ని సాధించింది.  ఇక ఇరుజట్లు ఇప్పటివరకూ 16 సార్లు ముఖాముఖి పోరులో తలపడగా సన్‌రైజర్స్‌ 10 విజయాలు సాధించగా, ఢిల్లీ 6సార్లు గెలుపును సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది. ఒక ఎస్‌ఆర్‌హెచ్‌ మూడు మార్పులు చేసింది.  బెయిర్‌ స్టో, ప్రియాం గార్గ్‌, ఖలీల్‌ అహ్మద్‌లకు విశ్రాంతి ఇచ్చారు. వీరి స్థానాల్లో విలియమ్సన్‌, సాహా, నదీమ్‌లను  తుది జట్టులోకి వచ్చారు.

ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్‌ 14  పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా, ఆరెంజ్‌ ఆర్మీ 8 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. గత ఐదు మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్‌ నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమి చెంది, ఒక  దాంట్లో విజయం నమోదు చేసింది. ఢిల్లీ గత ఐదు మ్యాచ్‌లకు గాను మూడు విజయాలను సొంతం చేసుకోగా, రెండింట ఓటమి చూసింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ గెలిస్తేనే ప్లేఆఫ్‌ రేసులో ఆశల్ని సజీవంగా ఉంచుకుంటుంది. ఓడిపోతే మాత్రం దాదాపు దారులు మూసుకుపోతాయి. ఇది ఎస్‌ఆర్‌హెచ్‌12వ మ్యాచ్‌. ఇది కాకుండా రెండు మ్యాచ్‌లు మాత్రమే వార్నర్‌ గ్యాంగ్‌ ఆడాల్సి ఉంది. ప్రస్తుత మ్యాచ్‌తో కలుపుకుని మూడింట విజయం సాధిస్తేనే ఆశలు పెట్టుకోవచ్చు. ఇందులో ఏ ఒక్క మ్యాచ్‌ ఓడినా సన్‌రైజర్స్‌ పరిస్థితి క్లిష్గంగా మారిపోతుంది. తుది గణాంకాలు నాటికి ఏడు మ్యాచ్‌లు గెలిచి ఉంటే ఆ జట్టు బరిలో నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఎస్‌ఆర్‌హెచ్‌ జట్టులో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో డేవిడ్‌ వార్నర్‌(370), బెయిర్‌ స్టో(345), మనీష్‌ పాండే(310)లు వరుస స్థానాల్లో ఉండగా, బౌలింగ్‌ యూనిట్‌లో అత్యధిక వికెట్లు సాధించిన జాబితాలో రషీద్‌ ఖాన్‌(14), టి. నటరాజన్‌(11), ఖలీల్‌ అహ్మద్‌(8)లు వరుస స్థానాల్లో కొనసాగుత్నునారు. మరొకవైపు ఢిల్లీ జట్టులో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో శిఖర్‌ ధావన్‌(471), శ్రేయస్‌ అయ్యర్‌(382), మార్కస్‌ స్టోయినిస్‌(232)లు వరుసగా ఉన్నారు. అత్యధిక వికెట్లు తీసిన ఢిల్లీ బౌలర్ల జాబితాలో రబడా(23), నోర్జే(14), అక్షర్‌ పటేల్‌(8)లు వరుస స్థానాల్లో ఉన్నారు. 

సన్‌రైజర్స్‌
డేవిడ్‌ వార్నర్‌(కెప్టెన్‌), కేన్‌ విలియమ్సన్‌, మనీష్‌ పాండే, విజయ్‌ శంకర్‌, వృద్ధిమాన్‌ సాహా, జేసన్‌ హోల్డర్‌, అబ్దుల్‌ సామద్‌, రషీద్‌ ఖాన్‌, నదీమ్‌, సందీప్‌ శర్మ, టి. నటరాజన్‌

ఢిల్లీ క్యాపిటల్స్‌
శ్రేయస్‌ అయ్యర్‌(కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, అజింక్యా రహానే, రిషభ్‌ పంత్‌, హెట్‌మెయిర్‌, స్టోయినిస్‌, అక్షర్‌ పటేల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, కగిసో రబడా, నోర్జే, దేశ్‌పాండే
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top