సబలెంకా జోరు  | Sakshi
Sakshi News home page

సబలెంకా జోరు 

Published Sat, Jan 20 2024 3:58 AM

Defending champion into the pre quarter finals - Sakshi

మెల్‌బోర్న్‌: టైటిల్‌ నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో  ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో బరిలోకి దిగిన ప్రపంచ రెండో ర్యాంకర్‌ సబలెంకా ఆ దిశగా మరో అడుగు వేసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ మూడో రౌండ్‌లో రెండో సీడ్‌ సబలెంకా విశ్వరూపం ప్రదర్శించింది. ప్రపంచ 33వ ర్యాంకర్, 28వ సీడ్‌ లెసియా సురెంకో (ఉక్రెయిన్‌)తో జరిగిన మ్యాచ్‌లో సబలెంకా 6–0, 6–0తో ఘనవిజయం సాధించి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. కేవలం 52 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సబలెంకా తన ప్రత్యర్థికి ఒక్క గేమ్‌ కూడా కోల్పోకపోవడం విశేషం. ఒక్క డబుల్‌ ఫాల్ట్‌ కూడా చేయని సబలెంకా 16 విన్నర్స్‌ కొట్టి ప్రత్యర్థి సర్విస్‌ను ఆరుసార్లు బ్రేక్‌ చేయడం విశేషం.   

పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ జొకోవిచ్‌ (సెర్బియా), నాలుగో సీడ్‌ సినెర్‌ (ఇటలీ), ఐదో సీడ్‌ రుబ్లెవ్‌ (రష్యా), ఏడో సీడ్‌ సిట్సిపాస్‌ (గ్రీస్‌) ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు.   పురుషుల డబుల్స్‌ రెండో రౌండ్‌లో రోహన్‌ బోపన్న (భారత్‌)–మాథ్యూ ఎబ్డెన్‌ (ఆ్రస్టేలియా) ద్వయం 6–2, 6–4తో జాన్‌ మిల్మన్‌–ఎడ్వర్డ్‌ వింటర్‌ (ఆస్ట్రేలియా) జోడీపై గెలిచి మూడో రౌండ్‌లోకి అడుగు పెట్టింది. తొలి రౌండ్‌ మ్యాచ్‌లో శ్రీరామ్‌ బాలాజీ (భారత్‌)–విక్టర్‌ కార్నియా (రొమేనియా) జంట 6–3, 6–4తో అర్నాల్డీ–పెలెగ్రినో (ఇటలీ) జోడీపై నెగ్గి రెండో రౌండ్‌కు చేరుకుంది.   

Advertisement
 
Advertisement
 
Advertisement