
పారిస్: ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–3 టోర్నీని భారత్ రజత పతకంతో ముగించింది. ఆదివారం జరిగిన మహిళల టీమ్ రికర్వ్ ఫైనల్లో దీపిక కుమారి, అంకిత, సిమ్రన్‌జిత్ కౌర్‌లతో కూడిన భారత జట్టు రన్నరప్‌గా నిలిచింది. చైనీస్ తైపీ జట్టుతో జరిగిన ఫైనల్లో దీపిక బృందం 1–5తో ఓడిపోయింది.
ఈ టోర్నీలో భారత్‌కు మొత్తం మూడు పతకాలు లభించాయి. కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో జ్యోతి సురేఖ–అభిషేక్ వర్మ జంట స్వర్ణం నెగ్గగా... కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో జ్యోతి సురేఖ రజతం సాధించింది.
చదవండి: Ranji Trophy 2022: 'కెప్టెన్ పెళ్లికి రెండు రోజుల సెలవు మాత్రమే ఇచ్చాను'