బధిరుల ఒలింపిక్స్‌ గోల్ఫ్‌ ఫైనల్లో దీక్ష  | Deaflympics 2022: Deeksha Dagar Enters Final Womens Golf | Sakshi
Sakshi News home page

Deaflympics 2022: బధిరుల ఒలింపిక్స్‌ గోల్ఫ్‌ ఫైనల్లో దీక్ష 

May 12 2022 7:41 AM | Updated on May 12 2022 7:44 AM

Deaflympics 2022: Deeksha Dagar Enters Final Womens Golf - Sakshi

బ్రెజిల్‌లో జరుగుతున్న బధిరుల ఒలింపిక్స్‌ (డెఫిలింపిక్స్‌) క్రీడల్లో భారత మహిళా గోల్ఫర్‌ దీక్ష డాగర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. గత క్రీడల్లో (2017)లో రజతం గెలిచిన ఆమె ఈ సారి స్వర్ణ పతకంపై గురి పెట్టింది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో 21 ఏళ్ల దీక్ష...  అండ్రియా హోవ్‌స్టెయిన్‌ (నార్వే)పై విజయం సాధించింది. గురువారం జరిగే ఫైనల్లో భారత గోల్ఫర్‌ అమెరికాకు చెందిన యాష్లిన్‌ గ్రేస్‌ జాన్సన్‌తో తలపడుతుంది. 

Advertisement
 
Advertisement
Advertisement