డేవిడ్‌ వార్నర్‌ ఇన్‌.. బర్న్స్‌ అవుట్‌

David Warner Returns Australian Squad For 3rd And 4th Test Against India - Sakshi

సిడ్నీ : టీమిండియాతో జరగనున్న మూడో టెస్టుకు ఆసీస్‌ విధ్వంసక ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌ అందుబాటులోకి రానున్నాడు.  మొదటి రెండు టెస్టుల్లో ఆడిన ఓపెనర్‌ జో బర్న్స్‌ స్థానంలో వార్నర్‌ను ఎంపిక చేసినట్లు ఆసీస్‌ జట్టు సెలెక్టర్‌ ట్రేవర్‌ హోన్స్‌ తెలిపాడు. ఈ మేరకు మూడు, నాలుగు టెస్టులకు 18 మందితో ఆసీస్‌ జట్టును ప్రకటించింది. కాగా టీమిండియాతో జరిగిన రెండో వన్డేలో వార్నర్‌ గాయపడిన సంగతి తెలిసిందే.గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో చివరి వన్డేతో పాటు మూడు టీ20ల సిరీస్‌కు దూరమయ్యాడు. (చదవండి : ‘స్టీవ్‌ స్మిత్‌పై నాకు నమ్మకం ఉంది’)

అయితే వార్నర్‌ టెస్టు సిరీస్‌కు అందుబాటులో ఉంటాడని అంతా భావించారు.. కానీ గాయం తీవ్రతపై స్పష్టం లేకపోవడంతో మొదటి రెండు టెస్టులకు అతన్ని పరిగణలోకి తీసుకోలేదు. తాజాగా వార్నర్‌ గాయం నుంచి పూర్తిగా కోలుకోవడంతో మిగిలిన రెండు టెస్టులకు ఎంపిక చేశామని క్రికెట్‌ ఆస్ట్రేలియా పేర్కొంది. వాస్తవానికి జో బర్న్స్‌ మొదటి రెండు టెస్టుల్లో పర్వాలేదనిపించే ప్రదర్శన నమోదు చేశాడు. బర్న్స్‌ నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 8,51*, 0,4 కలిపి 125 పరుగులు సాధించాడు. ఇందులో ఒక అర్థసెంచరీ ఉంది.

అయితే మరో ఓపెనర్‌ మాథ్యూ వేడ్‌ ప్రదర్శన స్థిరంగా ఉండడంతో వార్నర్‌ కోసం  బర్న్స్‌ను పక్కడపెట్టాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. మరోవైపు త్యాగి బౌన్సర్‌తో గాయపడ్డ పుకోవిస్కిని ఎంపిక చేసినా తుది జట్టులోకి వచ్చే దానిపై స్పష్టత లేదని తెలిపింది. కాగా వార్నర్‌ రాకతో ఆసీస్‌ కాస్త బలంగా తయారైనట్లు కనిపిస్తుంది. అడిలైడ్‌ వేదికగా జరిగిన మొదటి టెస్టులో టీమిండియాపై ఘన విజయం సాధించిన ఆసీస్‌కు మెల్‌బోర్న్‌లో షాక్‌ తగిలింది. టీమిండియా సమిష్టి ప్రదర్శనతో రెండో టెస్టులో ఆసీస్ ఘోర పరాజయం మూటగట్టుకుంది.  ఇరుజట్ల మధ్య మూడో టెస్టు సిడ్నీ వేదికగా జనవరి 7 నుంచి జరగనుంది.

ఆస్ట్రేలియా జట్టు
డేవిడ్ వార్నర్‌, విల్‌ పుకోవిస్కీ, మార్కస్ హారిస్‌, మాథ్యూ వేడ్‌, స్టీవ్‌ స్మిత్, మార్నస్ లబుషేన్, ట్రేవిస్‌ హెడ్, మాట్ హెన్రిక్స్‌, టిమ్‌ పైన్ (కెప్టెన్‌), పాట్ కమిన్స్‌, కెమెరాన్‌ గ్రీన్‌, సీన్ అబాట్‌,నాథన్‌ లైయన్‌, మిచెల్‌ స్టార్క్‌, మిచెల్‌ స్వెప్సన్‌, జోష్ హాజిల్‌వుడ్‌, జేమ్స్ ప్యాటిన్సన్‌, మైఖేల్‌ నాజర్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top