David Warner-Stuart Broad: 'వాళ్లిద్దరికే వికెట్లు పడుతున్నాయి.. నీ బాధ నాకు అర్థమైంది'

David Warner Hilarious Post After Stuart Broad Dismisses Devon Conway  - Sakshi

కొత్త కెప్టెన్‌.. కొత్త కోచ్‌ రావడంతో ఇంగ్లండ్‌ దశ మారినట్లుంది. క్రికెట్‌ మక్కాగా పిలుచుకునే లార్డ్స్‌ వేదికగా న్యూజిలాండ్‌తో ప్రారంభమైన తొలి టెస్టులో ఇంగ్లండ్‌ బౌలర్లు చెలరేగడంతో కివీస్‌ జట్టు కకావికలమైంది. ఇంగ్లీష్‌ బౌలర్ల దాటికి న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 134 పరుగులకే ఆలౌటైంది. రీఎంట్రీ ఇచ్చిన అండర్సన్‌.. డెబ్యూ టెస్టు ఆడుతున్న మాథ్యూ పాట్స్‌ చెరో నాలుగు వికెట్లతో చెలరేగారు. ఆ తర్వాత కివీస్‌ బౌలర్లు కూడా తామేం తక్కువ తిన్నామా అన్నట్లుగా చెలరేగిపోయారు. దీంతో తొలిరోజు ఆటముగిసే సమయానికి ఏడు వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది.

ఈ సంగతి పక్కనబెడితే.. ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌.. తన ఇన్‌స్టా‍గ్రామ్‌లో ఇచ్చిన క్యాప్షన్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ''డెవన్‌ కాన్వే.. నీ బాధ నాకు అర్థమయింది..'' అంటూ కాన్వే ఫోటో కాకుండా బ్రాడ్‌ ఫోటోను పెట్టాడు. కాన్వేకు బదులుగా బ్రాడ్‌ ఫోటో పెట్టడం వెనుక ఒక చిన్న కథ ఉంది. మ్యాచ్‌లో అండర్సన్‌, బ్రాడ్‌లు రీఎంట్రీ ఇచ్చారు. రొటేషన్‌లో భాగంగా విండీస్‌తో సిరీస్‌కు వీరిద్దరిని దూరంగా పెట్టారు. ఇక కివీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇద్దరికి అవకాశం వచ్చింది.


అండర్సన్‌ తనకు వచ్చిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడు. 4 వికెట్లు తీసి కివీస్‌ ఆలౌట్‌ కావడంలో కీలకపాత్ర పోషించాడు. అతనికి తోడుగా డెబ్యూ బౌలర్‌ మాథ్యూ పాట్స్‌ కూడా నాలుగు వికెట్లతో దుమ్మురేపాడు. ఇద్దరే చెరో నాలుగు వికెట్లు తీయడంతో బ్రాడ్‌కు ఒక్క వికెట్‌ దక్కుతుందా లేదా అనే అనుమానం కలిగింది. కానీ డెవన్‌ కాన్వే రూపంలో బ్రాడ్‌కు అదృష్టం తగిలింది. ఆఫ్‌స్టంప్‌కు వైడ్‌ రూపంలో వెళ్తున్న బంతిని అనవసరంగా గెలుకున్న కాన్వే వికెట్‌ సమర్పించుకున్నాడు.

అలా ఎట్టకేలకు అండర్సన్‌, మాథ్యూ పాట్స్‌ల మధ్య బ్రాడ్‌ వికెట్‌ దక్కించకున్నాడు. ఇది పసిగట్టిన వార్నర్‌ కాస్త తెలివిని ప్రదర్శిస్తూ కాన్వేపై జాలి చూపిస్తూనే.. ఇన్‌డైరెక్ట్‌గా బ్రాడ్‌కు మెసేజ్‌ పంపాడు. ''ఇన్నింగ్స్‌లో వాళ్లిద్దరే వికెట్లన్నీ పడగొట్టారు.. నీకు దక్కుతుందో లేదో అని భయపడ్డా.. మొత్తానికి దక్కించుకున్నావు.. నీ బాధ నాకు అర్థమయింది'' అంటూ పేర్కొన్నాడు. 

చదవండి:  అప్పుడు మొత్తుకున్నారుగా.. ఇప్పుడేం మాట్లాడరా!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top