CWC 2023: ఆఫ్ఘన్‌ బ్యాటర్ల అద్భుత పోరాటం​.. ఇంగ్లండ్‌ పేసర్లకు చుక్కలు | Sakshi
Sakshi News home page

CWC 2023: ఆఫ్ఘన్‌ బ్యాటర్ల అద్భుత పోరాటం​.. ఇంగ్లండ్‌ పేసర్లకు చుక్కలు

Published Sun, Oct 15 2023 6:02 PM

CWC 2023: Afghanistan Set 285 Runs target For England - Sakshi

న్యూఢిల్లీ వేదికగా ఇవాళ (అక్టోబర్‌ 15) జరుగుతున్న వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ బ్యాటర్లు ఇంగ్లండ్‌ పేస్‌ బౌలర్లకు చుక్కలు చూపించారు. ప్రపంచంలోనే మేటి పేసర్లుగా పరిగణించబడే క్రిస్‌ వోక్స్‌ (4-0-41-0), మార్క్‌ వుడ్‌ (9-0-50-2), సామ్‌ కర్రన్‌ (4-0-46), రీస్‌ టాప్లే (8.5-1-52-1)లను ఆఫ్ఘన్‌ బ్యాటర్లు ఉతికి ఆరేశారు.

ఆరంభంలో రహ్మానుల్లా గుర్బాజ్‌ (57 బంతుల్లో 80; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), ఆఖర్లో ఇక్రమ్‌ అలీఖిల్‌ (66 బంతుల్లో 58; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటంతో ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆఫ్ఘనిస్తాన్‌ 284 పరుగులకు (49.5 ఓవర్లలో) ఆలౌటైంది.

స్పిన్నర్లు ఆదిల్‌ రషీద్‌ (10-1-42-3), లియామ్‌ లివింగ్‌స్టోన్‌ (10-0-33-1), జో రూట్‌ (4-0-19-1) పొదుపుగా బౌలింగ్‌ చేయకుండి ఉంటే, ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ భారీ స్కోర్‌ సాధించి ఉండేది. స్పిన్‌కు అనుకూలిస్తున్న ఈ వికెట్‌పై ఈ స్కోర్‌ కూడా మంచి స్కోరనే చెప్పాలి. ఆఫ్ఘనిస్తాన్‌ అమ్ములపొదిలో రషీద్‌ ఖాన్‌, ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌, మొహమ్మద్‌ నబీ లాంటి ప్రపంచ మేటి స్పిన్నర్లు ఉండటంతో ఇంగ్లండ్‌కు ఛేదనలో కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది.

ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ చేసిన స్కోర్‌ వారికి ప్రపంచకప్‌ టోర్నీల్లో రెండో అత్యధిక స్కోర్‌ (2019 వరల్డ్‌కప్‌లో వెస్టిండీస్‌పై 288 పరుగులు) కావడం విశేషం. గత మ్యాచ్‌లో భారత్‌పై 272 పరుగులు చేసిన ఆఫ్ఘనిస్తాన్‌.. ఇవాళ మరో 12 పరుగులు అదనంగా చేసి ఇంగ్లండ్‌ ముందు డీసెంట్‌ టార్గెట్‌ను ఉంచింది. 

ఆఫ్ఘనిస్తాన్‌ ఇన్నింగ్స్‌లో గుర్బాజ్‌, ఇక్రమ్‌ అర్దసెంచరీలతో రాణించగా.. ఇబ్రహీం జద్రాన్‌ (28), రషీద్‌ ఖాన్‌ (23), ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌ (28) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఆఖర్లో ఇక్రమ్‌, రషీద్‌, ముజీబ్‌ల పోరాటం కారణంగానే ఆఫ్ఘనిస్తాన్‌ ఈ మ్యాచ్‌లో ఓ మోస్తరు స్కోర్‌ చేయగలిగింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement