రొనాల్డోకు కరోనా పాజిటివ్‌ | Cristiano Ronaldo Tested Coronavirus Positive | Sakshi
Sakshi News home page

క్రిస్టియానో రొనాల్డోకు కరోనా పాజిటివ్‌

Oct 13 2020 9:25 PM | Updated on Oct 13 2020 9:30 PM

Cristiano Ronaldo Tested Coronavirus Positive - Sakshi

లిస్బన్‌ : ఫుట్‌బాల్‌ స్టార్‌ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో కరోనా బారిన పడ్డాడు. ప్రస్తుతం నేషనల్‌ లీగ్‌ గేమ్స్‌ ఆడుతున్న కరోనా పాజిటివ్‌ రావడంతో వెంటనే జట్టును వీడి హోంఐసోలేషన్‌కు వెళ్లినట్లు పోర్చుగీస్‌ ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ పేర్కొంది. కాగా రొనాల్డొ కరోనా పాజిటివ్‌ అని తేలినా ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. దీంతో అతను ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నాడని ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌ తెలిపింది. మరోవైపు కరోనా బారిన పడిన రొనాల్డో త్వరగా కోలుకోవాలంటూ అతని అభిమానులు ప్రార్థిస్తున్నారు. కాగా రొనాల్డొ పోర్చుగల్‌ జట్టు తరపున 134 మ్యాచ్‌ల్లో 90 గోల్స్‌ సాధించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement