భారత్‌–ఆసీస్‌ పోరుపై అమితాసక్తి | Cricket Fans Interestingly Wating For Australia India Series | Sakshi
Sakshi News home page

భారత్‌–ఆసీస్‌ పోరుపై అమితాసక్తి

Nov 21 2020 8:16 AM | Updated on Nov 21 2020 8:16 AM

Cricket Fans Interestingly Wating For Australia India Series - Sakshi

సిడ్నీ : భారత్‌–ఆస్ట్రేలియా మధ్య జరగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌ల గురించి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా వన్డే, టి20ల కోసం జరిగిన టికెట్ల కొనుగోలు దీనిని నిరూపించింది. ఇరు జట్ల మధ్య 3 వన్డేలు, 3 టి20 మ్యాచ్‌ల కోసం అందుబాటులో ఉంచిన టికెట్లు మొత్తం దాదాపుగా అమ్ముడుపోయాయి. ఈ ఆరు మ్యాచ్‌లలో ఒక్క మ్యాచ్‌ కోసం మాత్రం ఇంకా టికెట్లు మిగిలి ఉన్నాయి. కరోనా కారణంగా ఈ మ్యాచ్‌లు జరిగే సిడ్నీ, కాన్‌బెర్రా వేదికల్లో స్టేడియం సామర్థ్యంలో 50 శాతం మందిని మాత్రమే అనుమతిస్తున్నారు. దాంతో టికెట్లకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. సిడ్నీ మైదానం ఉన్న న్యూసౌత్‌వేల్స్‌ రాష్ట్రంలో గత రెండు వారాలుగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడంతో ప్రేక్షకుల సంఖ్యను పెంచే ఆలోచన కూడా ఉంది. సాధారణంగా సిడ్నీలో ఎప్పుడు మ్యాచ్‌ జరిగినా...పెద్ద సంఖ్యలో భారత అభిమానులు హాజరవుతారు. (భారత్‌ కంటే ఆస్ట్రేలియా మెరుగు)

Advertisement
 
Advertisement
Advertisement