
అహ్మదాబాద్: బీసీసీఐ దేశవాళీ అండర్–25 టోర్నీ (కల్నల్ సీకే నాయుడు ట్రోఫీ)ను ముంబై సొంతం చేసుకుంది. బుధవారం ముగిసిన ఫైనల్ మ్యాచ్‌లో ముంబై 75 పరుగుల తేడాతో విదర్భపై విజయం సాధించింది. ఈ నాలుగు రోజుల మ్యాచ్‌లో ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 468 పరుగులు చేయగా విదర్భ 385 పరుగులు సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో 83 పరుగుల ఆధిక్యం సాధించిన ముంబై రెండో ఇన్నింగ్స్‌లో 113 పరుగులకే కుప్పకూలింది. 197 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన విదర్భ 121 పరుగులకే ఆలౌటైంది.
ట్రోఫీని అందుకుంటున్న ముంబై కెప్టెన్ హార్దిక్ తమోరే