breaking news
under-25
-
సీకే నాయుడు ట్రోఫీ విజేత ముంబై
అహ్మదాబాద్: బీసీసీఐ దేశవాళీ అండర్–25 టోర్నీ (కల్నల్ సీకే నాయుడు ట్రోఫీ)ను ముంబై సొంతం చేసుకుంది. బుధవారం ముగిసిన ఫైనల్ మ్యాచ్‌లో ముంబై 75 పరుగుల తేడాతో విదర్భపై విజయం సాధించింది. ఈ నాలుగు రోజుల మ్యాచ్‌లో ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 468 పరుగులు చేయగా విదర్భ 385 పరుగులు సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో 83 పరుగుల ఆధిక్యం సాధించిన ముంబై రెండో ఇన్నింగ్స్‌లో 113 పరుగులకే కుప్పకూలింది. 197 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన విదర్భ 121 పరుగులకే ఆలౌటైంది. ట్రోఫీని అందుకుంటున్న ముంబై కెప్టెన్ హార్దిక్ తమోరే -
అండర్–25 ఆంధ్రా క్రికెట్ జట్టుకు అనంత క్రీడాకారులు
అనంతపురం సప్తగిరిసర్కిల్ : అండర్–25 ఆంధ్రా క్రికెట్ జట్టుకు అనంతపురం జిల్లాకు చెందిన నరేష్, ముదస్సర్, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఎంపికయ్యారని జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి బీఆర్ ప్రసన్న తెలిపారు. స్టాండ్‌బైగా దాదా ఖలందర్‌ను ఎంపిక చేశారన్నారు. ఇటీవల విజయనగరంలో జరిగిన ప్రాబబుల్స్‌లో నరేష్ 7 వికెట్లు, ముదస్సర్ 6 వికెట్లు తీశాడు. ప్రవీణ్‌కుమార్‌రెడ్డి సెంచరీతో అలరించాడు. దీంతో సెలక్టర్లు వారిని ఆంధ్రా జట్టుకు ఎంపిక చేశారు. దాదా ఖలందర్ 7 వికెట్లు తీశాడు. ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 10 నుంచి 16 వరకు గుంటూరు జిల్లా పేరిచెర్లలో జరిగే అండర్–25 బీసీసీఐ సౌత్ ఇండియా రామ్మోహన్రావు ట్రోఫీలో పాల్గొంటారు. జిల్లా క్రీడాకారులకు రాష్ట్ర జట్టులో చోటు దక్కడంపై జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు మాంచో ఫెర్రర్, బీఆర్ ప్రసన్న హర్షం వ్యక్తం చేశారు.