
లండన్: ఐపీఎల్‌తో పోలిస్తే మరో రెండు ప్రధాన టోర్నీలకే (టి20 వరల్డ్‌కప్, యాషెస్) తన తొలి ప్రాధాన్యత కావడంతో లీగ్ రెండో దశలో పోటీల్లో పాల్గొనడం లేదని ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ వోక్స్ వెల్లడించాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో సభ్యుడిగా ఉన్న అతను ఈసారికి ఆడలేనంటూ తప్పుకున్నాడు. ‘టి20 వరల్డ్ కప్‌లో పాల్గొనే జట్టులో చోటు లభించడంతో అంతా మారిపోయింది. అందుకే జాతీయ జట్టుకే ప్రాధాన్యతనిస్తూ ఐపీఎల్‌కు దూరమయ్యాను’ అని వోక్స్ తెలిపాడు.