సూపర్‌ కింగ్స్‌ ట్రైనింగ్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ | Chennai Super Kings Green Signal For Practice Session | Sakshi
Sakshi News home page

సూపర్‌ కింగ్స్‌ ట్రైనింగ్‌కు గ్రీన్‌ సిగ్నల్‌

Aug 10 2020 2:24 AM | Updated on Aug 10 2020 2:24 AM

Chennai Super Kings Green Signal For Practice Session - Sakshi

చెన్నై: మూడు సార్లు ఐపీఎల్‌ విజేత చెన్నై సూపర్‌ కింగ్స్‌ యూఏఈ వెళ్లడానికి ముందు స్వల్పకాలిక శిక్షణ శిబిరంలో పాల్గొంటుంది. చెన్నైలో జరిగే ఈ ట్రెయినింగ్‌ సెషన్‌కు తమిళనాడు ప్రభుత్వం నుంచి అనుమతి పొందామని జట్టు యాజమాన్యం ఆదివారం తెలిపింది. ఈ నెల 15న ఈ శిబిరం ఆరంభం కానుంది. ఇందులో కెప్టెన్‌ ధోనితో సహా జట్టు సభ్యులు సురేశ్‌ రైనా, అంబటి రాయుడు, హర్భజన్‌ సింగ్, పీయూష్‌ చావ్లా, తదితర భారత ఆటగాళ్లు పాల్గొంటారని చెన్నై ఫ్రాంచైజీ వర్గాలు తెలిపాయి.

Advertisement
 
Advertisement
Advertisement