చరిత్ర సృష్టించిన శ్రీలంక కెప్టెన్‌.. 20 ఏళ్ల తర్వాత తొలిసారిగా! | Sakshi
Sakshi News home page

ICC Rankings: చరిత్ర సృష్టించిన శ్రీలంక కెప్టెన్‌.. 20 ఏళ్ల తర్వాత తొలిసారిగా!

Published Tue, Jul 4 2023 3:51 PM

Chamari Athapaththu first Sri Lanka player to top Womens ODI player rankings - Sakshi

శ్రీలంక మహిళల జట్టు కెప్టెన్‌ చమారీ ఆటపట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. ఐసీసీ ఉమన్స్‌ వన్డే ప్లేయర్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన మొదటి శ్రీలంక క్రికెటర్‌గా ఆటపట్టు రికార్డులకెక్కింది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో 758 పాయింట్లతో ఆటపట్టు టాప్‌ ర్యాంక్‌కు చేరుకుంది.

ఈ క్రమంలో ఆస్ట్రేలియా స్టార్‌ ఓపెనర్‌ బెత్‌ మూనీ(758)ను వెనుక్కి నెట్టింది. కాగా స్వదేశంలో న్యూజిలాండ్‌ మహిళల జట్టుతో జరిగిన వన్డే సిరీస్‌లో అటపట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది. మూడు మ్యాచ్‌ల్లో రెండు సెంచరీలతో చెలరేగింది. ఓవరాల్‌గా ఈ సిరీస్‌లో 248 పరుగులు అటపట్టు సాధించింది. ఈ అద్బుత ప్రదర్శన ఫలితంగా తన కెరీర్‌లో తొలిసారి నెం1 ర్యాంక్‌ను సొంతం చేసుకుంది.

జయసూర్య తర్వాత చమారీనే.. 
ఇక ఓవరాల్‌గా శ్రీలంక మెన్స్‌, ఉమెన్స్‌ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్‌గా కూడా ఆటపట్టు నిలిచింది. ఇప్పటివరకు శ్రీలంక క్రికెట్‌ దిగ్గజం సనత్ జయసూర్య వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్‌ ర్యాంక్‌ సాధించాడు. సెప్టెంబరు 2002 నుంచి మే 2003 వరకు జయసూర్య నెం1 ర్యాంక్‌లో కొనసాగాడు.

అ తర్వాత ఏ ఒక్క శ్రీలంక క్రికెటర్‌(మెన్స్‌ అండ్‌ ఉమన్స్‌) టాప్‌ ర్యాంక్‌ను సాధించలేకపోయారు. తాజాగా అటపట్టు 20 ఏళ్ల తర్వాత అగ్రస్ధానానికి చేరుకుని రికార్డులకెక్కింది. ఇక తాజాగా వన్డే ర్యాంకింగ్స్‌ విషయానికి వస్తే.. న్యూజిలాండ్‌ కెప్టెన్‌  సోఫీ డివైన్ రు స్థానాలు ఎగబాకి 13వ ర్యాంక్‌కు చేరుకుంది. శ్రీలంక సిరీస్‌లో భాగంగా రెండో వన్డేలో  సోఫీ డివైన్ 137 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌ ఆడింది.
చదవండి: Harbhajan Singh: ప్రపంచంలో టాప్ 5 బెస్ట్‌ ప్లేయర్స్‌ వీరే.. కోహ్లి, రోహిత్‌కు నో ఛాన్స్‌!

Advertisement
 
Advertisement