Cairo Shooting World Cup: భారత షూటర్‌ వరుణ్‌కు కాంస్యం | Cairo Shooting World Cup: Varun Tomar bags 10m air pistol bronze | Sakshi
Sakshi News home page

Cairo Shooting World Cup: భారత షూటర్‌ వరుణ్‌కు కాంస్యం

Feb 20 2023 5:47 AM | Updated on Feb 20 2023 5:47 AM

Cairo Shooting World Cup: Varun Tomar bags 10m air pistol bronze - Sakshi

ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నీలో భారత్‌ కాంస్య పతకంతో బోణీ చేసింది. ఈజిప్ట్‌ రాజధాని కైరోలో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో 19 ఏళ్ల వరుణ్‌ తోమర్‌ మూడో స్థానంలో నిలిచాడు.

ఆదివారం జరిగిన ర్యాంకింగ్‌ రౌండ్‌లో నిర్ణీత ఐదు సిరీస్‌ల తర్వాత వరుణ్, సరబ్‌జ్యోత్‌ సింగ్‌ 250.6 పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచారు. ‘షూట్‌ ఆఫ్‌ షాట్‌’లో వరుణ్‌ 10.3 పాయింట్లు స్కోరు చేసి కాంస్యం దక్కించుకోగా... సరబ్‌జ్యోత్‌ 10.1 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు.  

Advertisement
 
Advertisement
Advertisement