క్రికెట్‌లో చాలా అరుదైన సందర్భం

Blundell Gets Out Obstructing The Field Against Otago - Sakshi

వెల్లింగ్టన్‌: క్యాచ్‌ ఔట్‌, బౌల్డ్‌, రనౌట్‌, స్టంపింగ్‌.. ఇవే క్రికెట్‌లో మనకు రెగ్యులర్‌ కనిపించే డిస్మిసల్స్‌. మరి బంతిని బ్యాట్స్‌మన్‌ అడ్డుకుని ఔటైన సందర్భాలను చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. తాజాగా అటువంటి అరుదైన సందర్భమే చోటు చేసుకుంది.ప్లంకెట్‌ షీల్డ్‌ 2020-21 సీజన్‌లో భాగంగా వెల్టింగ్టన్‌-ఒటాగో జట్ల మధ్య జరిగిన న్యూజిలాండ్‌ దేశవాళీ మ్యాచ్‌లో ఒక బ్యాట్స్‌మన్‌ బంతిని చేతితో అడ్డుకుని పెవిలియన్‌ చేరాడు. వెల్టింగ్టన్‌ బ్యాట్స్‌మన్‌ టామ్‌ బ్లండెల్‌ ఒక బంతిని పొరపాటున చేతితో ఆపడానికి యత్నించి ఔటయ్యాడు. వెల్టింగ్టన్‌ రెండో ఇన్నింగ్స్‌లో భాగంగా బ్లండెల్‌ సెంచరీ చేశాడు. 147 బంతుల్లో 12 ఫోర్లతో  101 పరుగులు చేశాడు. అయితే ఒటాగో బౌలర్‌ జాకబ్‌ డఫ్పీ వేసిన ఒక బంతిని ఆడబోగా అది బ్యాట్‌కు తగలకుండా వికెట్లపైకి వెళ్లబోయింది.

దాన్ని ముందు కాలితో తన్ని ఆపిన బ్లండెల్‌.. మళ్లీ చేతితో దాన్ని బయటకు గెంటివేసే యత్నం చేశాడు. సాధారణంగా బ్యాట్‌తో కానీ కాలితో కానీ బంతిని ఆపితే ఔట్‌ ఉండదు. కానీ బంతి ల్యాండ్‌ అయిన తర్వాత దాన్ని చేతితో వికెట్లపైకి వెళ్లకుండా ఆపితే అది ఔట్‌గా నిర్దారిస్తారు. ఇలాగే ఔటయ్యాడు బ్లండెల్‌. దీన్ని అబ్‌స్ట్రక్టింగ్‌ ఔట్‌గా పరిగణిస్తారు. ఈ మ్యాచ్‌లో వెల్లింగ్టన్‌ 84 పరుగుల తేడాతో ఓటమి చెందగా,  ఈ ఔట్‌ వైరల్‌గా మారింది. ఇలా  ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో కివీస్‌ బ్యాట్స్‌మన్‌ ఔట్‌ కావడం రెండోసారి మాత్రమే. అంతకుముందు 1954-55 సీజన్‌లో జోన్‌ హేయ్స్‌ ఇలానే ఔటైన కివీస్‌ క్రికెటర్‌. 2018-19 సీజనఖ్‌లో డార్లీ మిచెల్‌ కూడా ఇలానే పెవిలియన్‌ చేరాడు. 2015లో మిచెల్‌ స్టార్క్‌ వేసిన బంతిని బెన్‌స్టోక్స్‌ ఇలాగే ఆపి వికెట్‌ సమర్పించుకున్నాడు. ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో టెస్టుల్లో ఈ తరహా ఔట్‌ ఒకసారే జరిగింది. వన్డే ఇంటర్నేషనల్స్‌ 7సార్లు, టీ20ల్లో రెండుసార్లు చోటు చేసుకుంది.
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top