breaking news
otago
-
క్రికెట్లో చాలా అరుదైన సందర్భం
వెల్లింగ్టన్: క్యాచ్ ఔట్, బౌల్డ్, రనౌట్, స్టంపింగ్.. ఇవే క్రికెట్లో మనకు రెగ్యులర్ కనిపించే డిస్మిసల్స్. మరి బంతిని బ్యాట్స్‌మన్ అడ్డుకుని ఔటైన సందర్భాలను చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. తాజాగా అటువంటి అరుదైన సందర్భమే చోటు చేసుకుంది.ప్లంకెట్ షీల్డ్ 2020-21 సీజన్లో భాగంగా వెల్టింగ్టన్-ఒటాగో జట్ల మధ్య జరిగిన న్యూజిలాండ్ దేశవాళీ మ్యాచ్‌లో ఒక బ్యాట్స్‌మన్ బంతిని చేతితో అడ్డుకుని పెవిలియన్ చేరాడు. వెల్టింగ్టన్ బ్యాట్స్‌మన్ టామ్ బ్లండెల్ ఒక బంతిని పొరపాటున చేతితో ఆపడానికి యత్నించి ఔటయ్యాడు. వెల్టింగ్టన్ రెండో ఇన్నింగ్స్‌లో భాగంగా బ్లండెల్ సెంచరీ చేశాడు. 147 బంతుల్లో 12 ఫోర్లతో 101 పరుగులు చేశాడు. అయితే ఒటాగో బౌలర్ జాకబ్ డఫ్పీ వేసిన ఒక బంతిని ఆడబోగా అది బ్యాట్‌కు తగలకుండా వికెట్లపైకి వెళ్లబోయింది. దాన్ని ముందు కాలితో తన్ని ఆపిన బ్లండెల్.. మళ్లీ చేతితో దాన్ని బయటకు గెంటివేసే యత్నం చేశాడు. సాధారణంగా బ్యాట్‌తో కానీ కాలితో కానీ బంతిని ఆపితే ఔట్ ఉండదు. కానీ బంతి ల్యాండ్ అయిన తర్వాత దాన్ని చేతితో వికెట్లపైకి వెళ్లకుండా ఆపితే అది ఔట్‌గా నిర్దారిస్తారు. ఇలాగే ఔటయ్యాడు బ్లండెల్. దీన్ని అబ్స్ట్రక్టింగ్ ఔట్‌గా పరిగణిస్తారు. ఈ మ్యాచ్‌లో వెల్లింగ్టన్ 84 పరుగుల తేడాతో ఓటమి చెందగా, ఈ ఔట్ వైరల్‌గా మారింది. ఇలా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో కివీస్ బ్యాట్స్‌మన్ ఔట్ కావడం రెండోసారి మాత్రమే. అంతకుముందు 1954-55 సీజన్లో జోన్ హేయ్స్ ఇలానే ఔటైన కివీస్ క్రికెటర్. 2018-19 సీజనఖ్లో డార్లీ మిచెల్ కూడా ఇలానే పెవిలియన్ చేరాడు. 2015లో మిచెల్ స్టార్క్ వేసిన బంతిని బెన్‌స్టోక్స్ ఇలాగే ఆపి వికెట్ సమర్పించుకున్నాడు. ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్లో టెస్టుల్లో ఈ తరహా ఔట్ ఒకసారే జరిగింది. వన్డే ఇంటర్నేషనల్స్ 7సార్లు, టీ20ల్లో రెండుసార్లు చోటు చేసుకుంది. A rare form of dismissal: @cricketwgtninc's Tom Blundell out on 101 for obstructing the field. @OtagoVolts going on to claim their first win of the season; they shoot up to 3= on the points table. #worththewait #plunketshield pic.twitter.com/fPvT0z3hK8 — #NZIII (@MargotButcher) November 8, 2020 -
స్త్రీల లోదుస్తులు దొంగిలించి.. ఆ తర్వాత...
వెల్లింగ్టన్: అరవై ఐదేళ్ల వయసున్న వ్యక్తి ఆడవాళ్ల లోదుస్తులు దొంగతనం చేసి పోలీసులకి చిక్కిన వింత ఘటన న్యూజిలాండ్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. ఉత్తర ఒటాగోకు చెందిన స్టీఫెన్ గ్రాహం గార్డ్నర్(65) స్పా సేవల కోసం వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న డునెదిన్లోని మోనా పూల్‌కి వెళ్లాడు. పూల్‌లో ఉండగా, పక్కనే ఉన్న ఫ్లాట్‌లో యువతులు అద్దెకి దిగిన విషయం తెలుసుకుని, వారు లేనప్పుడు కిటికీ గుండా ఆ ఫ్లాట్‌లోకి చొరబడ్డాడు. కాసేపటికి యువతులు తిరిగొచ్చిన చప్పుడు వినపడడంతో బయటికొచ్చి వారిని తోసుకుంటూ చోరీ చేసిన 8 జతల లోదుస్తులతో చీకట్లోకి పారిపోయాడు. పరిగెత్తుతున్నప్పుడు కొన్నిదుస్తులు జారిపడిపోయాయి. ఆ తర్వాత దగ్గర్లోని బార్‌కు వెళ్లి మద్యం సేవించి పడిపోయిన దుస్తులను తీసుకోవడానికి తిరిగొచ్చాడు. ఈ క్రమంలో పోలీసులు పట్టుకొని కోర్టులో హాజరు పరిచారు. జడ్జి ఇంకా శిక్ష ఖరారు చేయాల్సి ఉంది. కాగా, ఇతను 2013లో ఇలాంటి దొంగతనమే చేసి వెయ్యి డాలర్ల జరిమానాతో పాటు పదకొండు నెలల గృహ నిర్భందాన్ని ఎదుర్కొన్నాడు. -
చాంపియన్స్ లీగ్‌లో ఒటాగో పరుగుల సునామీ
చాంపియన్స్ లీగ్‌లో ఒటాగో పరుగుల సునామీ సృష్టించి రికార్డు సాధించింది. బుధవారమిక్కడ పెర్త్ స్కార్చర్స్‌తో మ్యాచ్‌లో ఒటాగో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 242 పరుగులు చేసింది. చాంపియన్స్ లీగ్‌లో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ఒటాగో ఓపెనర్ నీల్ బ్రూమ్ (56 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్సర్లతో 117 నాటౌట్) మెరుపు సెంచరీతో చెలరేగాడు. నీల్ బ్రూమ్తో పాటు టెన్ డష్కాటే (26 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 66) దూకుడుగా ఆడాడు. డెరెక్ డి బోర్డర్ 28 బంతుల్లో 45 పరుగులు చేశాడు. పారిస్ రెండు వికెట్లు తీశాడు.