బీసీసీఐ మెడికల్‌ టీమ్‌కు పాకిన కరోనా

BCCI Medical Team Member Tests Positive For Corona Virus - Sakshi

దుబాయ్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) తాజా సీజన్‌ కోసం యూఏఈకి వెళ్లిన భారత క్రికెట్‌ బృందాన్ని కరోనా వైరస్‌ వెంటాడుతోంది. ఇప్పటివరకూ చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే)ను కలవర పెట్టిన కరోనా.. భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ)కు పాకింది. బీసీసీఐ మెడికల్‌ టీమ్‌లోని సభ్యునికి కరోనా సోకింది. ఈ విషయాన్ని బీసీసీఐ ధృవీకరించింది. ఐపీఎల్‌ కోసం యూఏఈకి వెళ్లిన తర్వాత 13 మంది సీఎస్‌కే సభ్యులు కరోనా బారిన పడ్డారు. కాగా, రెండు రోజుల క్రితం నిర్వహించిన టెస్టుల్లో వారికి కరోనా నెగిటివ్‌ రావడంతో సీఎస్‌కే ఊపిరి పీల్చుకుంది. (చదవండి: ‘మాది తండ్రీ కొడుకుల బంధం’)

అయితే ఇప్పుడు బీసీసీఐ మెడికల్‌ టీమ్‌ సభ్యుడికి కరోనా రావడంతో మరోసారి కలవరం మొదలైంది. ఇదిలాఉంచితే, బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ(ఎన్‌సీఏ)లో ఉన్న ఇద్దరు సభ్యలకు కరోనా సోకిన విషయాన్ని సైతం బోర్డు సీనియర్‌ అధికారి ప్రకటించారు. ‘ దుబాయ్‌లో ఉన్న బీసీసీఐ సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌కు కరోనా సోకిన విషయం నిజమే. కానీ ప్రస్తుతం ప్రాబ్లం ఏమీ లేదు. అతను ఐసోలేషన్‌లో ఉన్నాడు. ఎవరితోనూ అతని కాంటాక్ట్‌ లేదు. యూఏఈకి వెళ్లే సమయంలో కూడా  ఏ క్రికెటర్‌తోనే అతను కాంటాక్ట్‌ కాలేదు. ఆ మెడికల్‌ ఆఫీసర్‌ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. తదుపరి టెస్టుల నాటికి అతనికి నెగిటివ్‌ వస్తుందని ఆశిస్తున్నాం. ఎన్‌సీఏలో ఇద్దరి సభ్యులకు కూడా కరోనా పాజిటివ్‌ వచ్చింది’ అని సదరు అధికారి వెల్లడించారు. (చదవండి: హఫీజ్‌ మెరుపులు..థ్రిల్లింగ్‌ విక్టరీ)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top