IND Vs BAN: బంగ్లాదేశ్‌తో రెండో వన్డే.. రాహుల్‌ త్రిపాఠి అరంగేట్రం! తుది జట్టు ఇదే?

BAN vs IND ODI Series 2022: India predicted XI against Bangladesh for 2nd ODI - Sakshi

బంగ్లాదేశ్‌తో తొలి వన్డేలో ఓటమిపాలైన టీమిండియా.. ఇప్పుడు అదే వేదికపై రెండో వన్డేలో తలపడేందుకు సిద్దమైంది. ఈ మ్యాచ్‌ ఢాకా వేదికగా బుధవారం మధ్యాహ్నం 12: 30 గంటలకు ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో బౌలింగ్‌ పరంగా అద్భుతంగా రాణించినప్పటికీ.. బ్యాటింగ్‌ పరంగా మాత్రం దారుణంగా విఫలమైంది.

ఇక కీలకమైన రెండో వన్డేలో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని రోహిత్‌ సేన భావిస్తోంది. రెండో వన్డేలో టీమిండియా పలు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. తొలి వన్డేల్లో మోకాలి నొప్పితో బాధపడిన శార్ధూల్‌ ఠాకూర్‌కు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. అతడి స్థానంలో యువ పేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్‌ ఉంది.

రాహుల్‌ త్రిపాఠి అరంగేట్రం!
అదే విధంగా ఆల్‌రౌండర్‌ షబాజ్‌ ఆహ్మద్‌ స్థానంలో  రాహుల్‌ త్రిపాఠి జట్టులోకి తీసుకోవాలని మేనేజేమెంట్‌ ఆలోచిస్తున్నట్లు సమాచారం. కాగా గత కొన్ని సిరీస్‌లను త్రిపాఠి జట్టుకు ఎంపిక అవుతున్నప్పటికీ.. అరంగేట్రం చేసే అవకాశం మాత్రం రాలేదు. ఈ మ్యాచ్‌తో త్రిపాఠి వన్డేల్లో డెబ్యూ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా పార్ట్‌ టైమ్‌ బౌలర్‌గా కూడా రాణించే సత్తా త్రిపాఠికి ఉంది.

ఇక తొలి మ్యాచ్‌లో భారీగా పరుగులు సమర్పించుకున్న యువ పేసర్‌ కుల్దీప్‌ సేన్‌ను రెండో వన్డేలో కూడా కొనసాగించే సూచనలు కన్పిస్తున్నాయి. మరోవైపు వెన్ను నొప్పితో బాధపడుతున్న అక్షర్‌ పటేల్‌ రెండో వన్డే జట్టు సెలక్షన్‌కు కూడా దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. 

భారత తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ (కెప్టెన్‌), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్‌ రాహుల్ (వికెట్‌ కీపర్‌), రాహుల్‌ త్రిపాఠి వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, ఉమ్రాన్‌ మాలిక్‌, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ సేన్

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top