Bahrain GP Qualifying: ఎఫ్‌1 సీజన్‌కు వేళాయె... | Bahrain GP Qualifying: Formula One is all set for the 2023 season | Sakshi
Sakshi News home page

Bahrain GP Qualifying: ఎఫ్‌1 సీజన్‌కు వేళాయె...

Mar 4 2023 6:17 AM | Updated on Mar 4 2023 6:17 AM

Bahrain GP Qualifying: Formula One is all set for the 2023 season - Sakshi

సాఖిర్‌ (బహ్రెయిన్‌): ఫార్ములావన్‌ (ఎఫ్‌1) 2023 సీజన్‌కు రంగం సిద్ధమైంది. 23 రేసుల ఈ సీజన్‌లో తొలి రేసు బహ్రెయిన్‌ గ్రాండ్‌ప్రి ఆదివారం జరుగుతుంది. అంతకుముందు శనివారం ప్రధాన రేసుకు సంబంధించిన గ్రిడ్‌ పొజిషన్‌ను తేల్చేందుకు క్వాలిఫయింగ్‌ సెషన్‌ను నిర్వహిస్తారు.

క్వాలిఫయింగ్‌ సెషన్‌లో అత్యంత వేగంగా ల్యాప్‌ను పూర్తి చేసిన డ్రైవర్‌ ప్రధాన రేసును ‘పోల్‌ పొజిషన్‌’ హోదాలో తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. ఈ సీజన్‌లో కూడా డిఫెండింగ్‌ చాంపియన్‌ మాక్స్‌ వెర్‌స్టాపెన్‌ (రెడ్‌బుల్‌ జట్టు) తన జోరు కొనసాగించే అవకాశముంది. అతనికి హామిల్టన్‌ (మెర్సిడెస్‌), లెక్‌లెర్క్‌ (ఫెరారీ) నుంచి గట్టిపోటీ ఎదురయ్యే చాన్స్‌ ఉంది. మొత్తం 10 జట్ల నుంచి 20 మంది డ్రైవర్లు మొత్తం 23 రేసుల్లో పాల్గొంటారు. 

Advertisement
 
Advertisement
Advertisement