వన్డేల్లో టాప్‌ ర్యాంక్‌ను నిలుపుకున్న బాబర్ ఆజం.. | Babar Azam solidifies top position as ICC announce latest ODI rankings | Sakshi
Sakshi News home page

ICC Rankings: వన్డేల్లో టాప్‌ ర్యాంక్‌ను నిలుపుకున్న బాబర్ ఆజం..

Aug 17 2022 6:10 PM | Updated on Aug 17 2022 9:16 PM

Babar Azam solidifies top position as ICC announce latest ODI rankings - Sakshi

ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్ ఆజం తన నెం1 స్థానాన్ని నిలుపుకున్నాడు. మంగళవారం నెదార్లాండ్స్‌తో జరిగిన వన్డేలో 74 పరుగులు సాధించిన బాబర్‌.. 891 పాయింట్లతో తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక పాక్‌ ఓపెనర్‌ ఇమామ్-ఉల్-హక్ 800 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు.

టీ20ల్లోనూ నెం1 ర్యాంక్‌
బాబర్‌ ఆజాం టీ20ల్లోనూ టాప్‌ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. 818 పాయింట్లతో బాబర్‌ తొలి స్థానంలో ఉండగా.. భారత ఆటగాడు సూర్య కుమార్‌ యాదవ్‌(794), పాక్‌ వికెట్‌ కీపర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌(794) రెండు మూడు స్థానాల్లో నిలిచారు. ఇక​ న్యూజిలాండ్ ఆటగాడు డెవాన్ కాన్వే తాజా ర్యాంకింగ్స్‌లో అదరగొట్టాడు. విండీస్‌తో టీ20 సిరీస్‌లో అద్భుతంగా రాణించిన కాన్వే 683 పాయింట్లతో ఏడో స్థానానికి చేరుకున్నాడు.

ఇక బౌలర్ల విషయానికి వస్తే.. బౌలర్ల టీ20 ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా పేసర్‌ జోష్ హేజిల్‌వుడ్ 792 పాయింట్లతో అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. అదే విధంగా వన్డే ర్యాంకింగ్స్‌లో కూడా హేజిల్‌వుడ్ పురోగతి సాధించాడు. ప్రస్తుతం అతడు వన్డేల్లో 679 పాయింట్లతో మూడో స్థానానికి చేరుకున్నాడు. ఇక ఐర్లాండ్‌ పర్యటనలో అద్భుతంగా రాణించిన న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ మిచెల్ సాంట్నర్ టీ20ల్లో  8వ ర్యాంక్ సాధించాడు.
చదవండిసూర్యను డివిలియర్స్‌తో పోల్చడమేంటి? జెట్‌ లాగ్‌ వల్లేనేమో: పాక్‌ మాజీ కెప్టెన్‌

Advertisement
 
Advertisement
Advertisement