Babar Azam Reply Kaun Sa On Being Asked About Breaking Kohli Record - Sakshi
Sakshi News home page

Babar Azam: కోహ్లి రికార్డు బ్రేక్‌ చేశారు కదా! ఏదీ! అబ్బో.. పాక్‌ కెప్టెన్‌ బిల్డప్‌ మామూలుగా లేదు!

Jul 5 2022 2:40 PM | Updated on Jul 5 2022 4:51 PM

Babar Azam Reply Kaun Sa On Being Asked About Breaking Kohli Record - Sakshi

పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం(PC: PCB)

కోహ్లి రికార్డు బ్రేక్‌ చేశారు కదా! ఏ రికార్డు అంటూ పాక్‌ కెప్టెన్‌ స్పందన.. బిల్డప్‌ వద్దు అంటూ నెటిజన్ల కామెంట్లు

Trolls On Babar Azam Which One On Breaking Kohli Record: పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఇప్పటికే పలు రికార్డులు సృష్టించాడు. ఐసీసీ పురుషుల వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఇటీవలి టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్ర స్థానాన్ని నిలబెట్టకున్న బాబర్‌ ఆజమ్‌ సరికొత్త రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో అత్యధిక కాలం నంబర్‌ 1 స్థానంలో ఉన్న బ్యాటర్‌గా నిలిచి టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి రికార్డు బద్దలు కొట్టాడు. గతంలో కూడా కోహ్లి పేరిట ఉన్న పలు రికార్డులను బాబర్‌ ఆజం బ్రేక్‌ చేశాడు. ఈ నేపథ్యంలో శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ముందు ప్రెస్‌మీట్‌లో ఎదురైన ప్రశ్నకు బాబర్‌ స్పందించిన విధానం వైరల్‌ అవుతోంది. కోహ్లి రికార్డు అధిగమించారు కదా అంటూ రిపోర్టర్‌ ప్రశ్నించగా.. ఏ రికార్డు అంటూ బాబర్‌ బదులిచ్చాడు. 

ఇంతలో తన తాజా రికార్డు (అత్యధిక కాలం నంబర్‌ 1 స్థానం) గుర్తుకు వచ్చి.. ‘‘ఇందుకు నేను దేవుడికి ధన్యవాదాలు చెప్పాలి. నా అద్భుత ప్రదర్శనల వెనుక ఎంతో కఠోర శ్రమ దాగి ఉంది’ అని చెప్పుకొచ్చాడు. అంతా బాగానే ఉన్నా బాబర్‌ ఆజమ్‌ ఇలా స్పందించడంపై కొంతమంది నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

‘‘కోహ్లి రికార్డులన్నీ బద్దలు కొట్టినట్లు తెగ బిల్డప్‌ ఇస్తున్నావు.. ఏవో కొన్ని రికార్డులు అధిగమించినంత మాత్రాన తనను దాటేసినట్లే అనుకోవద్దు. నువ్వు ఓపెనింగ్‌ బ్యాటర్‌వి.. కోహ్లి అలా కాదు. ఇంకా పరిమిత ఓవర్ల క్రికెట్‌లోనే కాదు టెస్టు క్రికెట్‌లోనూ కోహ్లి ది బెస్ట్‌ అని గుర్తుపెట్టుకో’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

చదవండి: Jasprit Bumrah: బుమ్రాకు కెప్టెన్సీ.. సాహసోపేతమైన నిర్ణయం! బహుశా అందుకేనేమో!

Advertisement
 
Advertisement
Advertisement