
ఏటీపీ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ మళ్లీ తన అగ్ర స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. సోమవారం ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో జొకోవిచ్ నంబర్‌వన్‌గా నిలిచాడు.
రెండు వారాల క్రితం అతను తన టాప్ ర్యాంక్‌ను స్పెయిన్‌కు చెందిన అల్‌కరాజ్‌కు కోల్పోయాడు.అయితే మయామీ ఓపెన్‌లో అల్‌కరాజ్ సెమీస్‌లోనే ఓడటంతో రెండో ర్యాంక్‌కు పడిపోయాడు. జొకోవిచ్ కెరీర్ నంబర్‌వన్‌గా ఇది 381వ వారం కావడం విశేషం.