రిత్విక్‌–అర్జున్‌ జోడీకి ఏటీపీ చాలెంజర్‌ టైటిల్‌ 

ATP Challenger title for Ritwik Arjun pair - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అసోసియేషన్‌ ఆఫ్‌ టెన్నిస్‌ ప్రొఫెషనల్స్‌ (ఏటీపీ) సర్క్యూట్‌లో హైదరాబాద్‌ యువ క్రీడాకారుడు బొల్లిపల్లి రిత్విక్‌ చౌదరీ కెరీర్‌లో తొలి చాలెంజర్‌ డబుల్స్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఇటలీలో జరిగిన ఒల్బియా ఓపెన్‌ ఏటీపీ చాలెంజర్‌–125 టోర్నీలో రిత్విక్‌ చౌదరీ–అర్జున్‌ ఖడే (భారత్‌) జోడీ విజేతగా నిలిచింది.

ఫైనల్లో రిత్విక్‌–అర్జున్‌ ద్వయం 6–1, 6–3తో ఇవాన్‌ సబనోవ్‌–మాతెజ్‌ సబనోవ్‌ (సెర్బియా) జంటపై గెలిచింది. ఈ ఏడాది రిత్విక్‌ –అర్జున్‌ జోడీ పోర్టో ఓపెన్, బ్రాన్‌òÙ్వగ్‌ ఓపెన్‌ ఏటీపీ చాలెంజర్‌ టోర్నీలలో ఫైనల్‌ చేరి రన్నరప్‌ ట్రోఫీలతో సంతృప్తి పడ్డారు. మూడో ప్రయత్నంలో ఈ జంట తొలి టైటిల్‌ను కైవసం చేసుకుంది.

తొలి రౌండ్‌లో రిత్విక్‌–అర్జున్‌ 6–3, 6–4తో శ్రీరామ్‌ బాలాజీ (భారత్‌)–ఆండ్రీ బెగెమన్‌ (జర్మనీ)లపై... క్వార్టర్‌ ఫైనల్లో 6–3, 6–4తో ఆండ్రూ హారిస్‌–జాన్‌ ప్యాట్రిక్‌ (ఆ్రస్టేలియా)లపై... సెమీఫైనల్లో 2–6, 7–6 (11/9), 10–7తో జెబవి–జెడెనెక్‌ (చెక్‌ రిపబ్లిక్‌)లపై గెలుపొందారు. టైటిల్‌ నెగ్గిన రిత్విక్‌–అర్జున్‌ జోడీకి 8,420 యూరోల (రూ. 7 లక్షల 41 వేలు) ప్రైజ్‌మనీ, 125 పాయింట్లు లభించాయి.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags:  

Read also in:
Back to Top