Women's Asia Cup 2022: ఛాంపియన్‌ భారత్‌కు దక్కిన ప్రైజ్ మనీ ఎంతంటే..?

Asia Cup 2022: Full list of award winners, prize money, statistics, best players - Sakshi

మహిళల ఆసియాకప్‌-2022 విజేతగా భారత్‌ నిలిచిన సంగతి తెలిసిందే. శనివారం షెల్లాట్‌ జరిగిన ఫైనల్లో శ్రీలంకను చిత్తు చేసి 7వ ఆసియాకప్‌ టైటిల్‌ను భారత జట్టు కైవసం చేసుకుంది. ఇక ఆసియాకప్‌ ఛాంపియన్స్‌గా నిలిచిన భారత జట్టుకు  ఫ్రైజ్‌మనీ ఎంత లభించింది?.. ఆసియాకప్ టాప్‌ రన్‌ స్కోరర్‌ ఎవరు? ఇటువంటి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

విజేతకు ఎంతంటే?
ఆసియాకప్‌ విజేతగా నిలిచిన భారత్‌కు ఫ్రైజ్‌మనీ రూపంలో ఇరవై వేల డాలర్లు(భారత కరెన్సీ ప్రకారం సుమారు 16లక్షల నాలభై ఎనిమిది వేల రూపాయలు) లభించింది. ఇందుకు సంబంధించిన చెక్‌ను టోర్నీ నిర్వహకులు భారత జట్టు కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌కు అందజేశారు. అదే విధంగా రన్నరప్‌గా నిలిచిన శ్రీలంకకు 12,500 డాలర్లు( భారత కరెన్సీ ప్రకారం సుమారు పది లక్షల ముఫ్పై వేలు)ఫ్రైజ్‌మనీ దక్కింది.

ఆసియాకప్‌-2022లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌లు వీరే
జెమిమా రోడ్రిగ్స్(భారత్‌)- 8 మ్యాచ్‌ల్లో 217 పరుగులు
హర్షిత మాధవి(శ్రీలంక)- 8 మ్యాచ్‌ల్లో 202 పరుగులు 
షఫాలీ వర్మ(భారత్‌)- 6 మ్యాచ్‌ల్లో-166 పరుగులు     
సిద్రా అమీన్(పాకిస్తాన్‌)- 7 మ్యాచ్‌ల్లో 158 పరుగులు 
నిదా దార్(పాకిస్తాన్‌) - 7 మ్యాచ్‌ల్లో 145 పరుగులు 

ఆసియాకప్‌ అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్లు
దీప్తి శర్మ(భారత్‌)- 8 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు
ఇనోక రణావీరా(శ్రీలంక)- 8 మ్యాచ్‌ల్లో 13 వికెట్లు
రుమనా ఆహ్మద్‌(బంగ్లాదేశ్‌)-5 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు
ఓమైమా సోహెల్‌(పాకిస్తాన్‌)-7 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు

ఇక ఈ మెగా ఈవెంట్‌లో ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన భారత స్టార్‌ ఆల్‌ రౌండర్‌ దీప్తి శర్మకు ప్లేయర్‌ ఆఫ్‌ది టోర్నమెంట్‌ అవార్డు దక్కింది. దీప్తికి అవార్డు రూపంలో 2000 డాలర్లు(భారత కరెన్సీ ప్రకారం సుమారు లక్షా ఆరవై నాలుగు వేల రూపాయలు) లభించింది.
చదవండి: T20 World Cup 2022:టీమిండియాతో మ్యాచ్‌.. ఆస్ట్రేలియా స్టార్‌ ఆటగాళ్లు దూరం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top