Virat Kohli Never Demanded 3 Tests For WTC final,But Only Expressed His Opinion Says R Ashwin - Sakshi
Sakshi News home page

అది కోహ్లి అభిప్రాయమే.. డిమాండ్‌ కాదు

Jul 3 2021 9:45 AM | Updated on Jul 3 2021 10:45 AM

Ashwin On Kohli Asking For Three Tests To Be Played For The WTC Final - Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌పై కెప్టెన్‌ కోహ్లి తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడని, బెస్టాఫ్‌ త్రీ ఫైనల్స్‌ కోసం డిమాండ్‌ చేయలేదని భారత స్పిన్నర్‌ అశ్విన్‌ వివరించాడు. ఓటమి ఎదురవగానే కోహ్లి చేసిన బెస్టాఫ్‌ త్రీ వ్యాఖ్యలపై వస్తున్న విమర్శలపై వెటరన్‌ స్పిన్నర్‌ స్పందిస్తూ ‘మాజీ ఇంగ్లండ్‌ ప్లేయర్‌ అథర్టన్‌ డబ్ల్యూటీసీ రసవత్తరంగా మారాలంటే ఏం చేయాలనే సూచనలకు బదులుగానే కోహ్లి తన అభిప్రాయం చెప్పాడు’ అని అశ్విన్‌ అన్నాడు.  

 ప్రపంచ టెస్టు చాంపియన్‌ను నిర్ధారించేందుకు ఒక ఫైనల్‌ మ్యాచ్‌ సరిపోదని, బెస్టాఫ్‌ త్రీ ఫైనల్స్‌లోనే అత్యుత్తమ జట్టు ఏదో తేలుతుందని భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి పేర్కొన్న సంగతి తెలిసిందే. ‘ ఒక్క మ్యాచ్‌తో ప్రపంచ అత్యుత్తమ జట్టు ఏదో ఖరారు చేయలేం. ఇది ఎంత మాత్రం సమంజసంగా లేదు. ఇది టెస్టు చాంపియన్‌షిప్‌ అయితే ఇందుకు తగినట్లే సిరీస్‌ ఉండాలి. అంటే మూడు మ్యాచ్‌ల సిరీస్‌ నిర్వహిస్తే బాగుండేది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement