29వసారి ఫైనల్లోకి అర్జెంటీనా | Argentina beat Colombia to reach Copa America final against Brazil | Sakshi
Sakshi News home page

29వసారి ఫైనల్లోకి అర్జెంటీనా

Jul 8 2021 5:46 AM | Updated on Jul 8 2021 5:46 AM

Argentina beat Colombia to reach Copa America final against Brazil - Sakshi

బ్రెసిలియా: కోపా అమెరికా కప్‌ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌లో లయనెల్‌ మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా జట్టు 29వసారి ఫైనల్లోకి ప్రవేశించింది. కొలంబియాతో జరిగిన సెమీఫైనల్లో అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్‌లో 3–2తో నెగ్గింది. నిర్ణీత సమయంలో రెండు జట్లు 1–1 తో సమంగా నిలిచాయి. అర్జెంటీనా తరఫున మార్టినెజ్‌ (7వ ని.లో), కొలంబియా తరఫున దియాజ్‌ (61వ ని.లో) ఒక్కో గోల్‌ చేశారు. అదనపు సమయంలో రెండు జట్లు గోల్స్‌ చేయకపోవడంతో షూటౌట్‌ అనివార్యమైంది. ఆదివారం జరిగే ఫైనల్లో బ్రెజిల్‌తో అర్జెంటీనా తలపడుతుంది. కోపా అమెరికా కప్‌లో అర్జెంటీనా 14 సార్లు విజేతగా నిలిచింది. చివరిసారి ఆ జట్టు 1993లో టైటిల్‌ గెల్చుకుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement