సెమీస్‌లో అనిరుధ్, రిత్విక్‌ జోడీలు    | Anirudh and Rithvik pairs in the semis | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో అనిరుధ్, రిత్విక్‌ జోడీలు   

Apr 20 2024 3:57 AM | Updated on Apr 20 2024 3:57 AM

Anirudh and Rithvik pairs in the semis - Sakshi

అకాపుల్కో (మెక్సికో): జీఎన్‌పీ సెగురోస్‌ ఓపెన్‌ ఏటీపీ చాలెంజర్‌–125 టెన్నిస్‌ టోర్నీ పురుషుల డబుల్స్‌ విభాగంలో హైదరాబాద్‌ ప్లేయర్లు అనిరుధ్‌ చంద్రశేఖర్, బొల్లిపల్లి రి త్విక్‌ చౌదరీ సంచలనం సృష్టించారు. అనిరుధ్‌ (భారత్‌)–హాన్స్‌ హచ్‌ వెర్డొగో (మెక్సికో)... రిత్విక్‌–నిక్కీ పునాచా (భారత్‌) జోడీలు సీడెడ్‌ జంటలను బోల్తా కొట్టించి సెమీఫైనల్లోకి ప్రవేశించాయి.

శుక్రవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్స్‌లో రి త్విక్‌–నిక్కీ జంట 6–4, 6–1తో రెండో సీడ్‌ పీటర్‌ మటుస్‌జెవ్‌స్కీ (పోలాండ్‌)–మాథ్యూ క్రిస్టోఫర్‌ రొమియోస్‌ (ఆ్రస్టేలియా) జోడీని ఓడించగా... అనిరుధ్‌–వెర్డొగో ద్వయం 3–6, 6–4, 10–7తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో మూడో సీడ్‌ రింకీ హిజికాటా (ఆ్రస్టేలియా)–మ్యాక్‌ కిగెర్‌ (అమెరికా) జంటకు షాక్‌ ఇచ్చింది.   

Advertisement
 
Advertisement
Advertisement