Andrew Symonds: ఆండ్రూ సైమండ్స్‌కు నివాళి ప్రకటించనున్న ఆసీస్‌, జింబాబ్వే క్రికెటర్లు

Andrew Symonds Family-To-Pay-Tribute-Aussie-Great-During-Aus-Zim ODI - Sakshi

ఆండ్రూ సైమండ్స్‌.. క్రికెట్‌లో ఈ పేరు తెలియని వారుండరు. ఆటలో ఎన్ని వివాదాలున్నా గొప్ప ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు. అతని ఆటకు ఫిదా అయిన అభిమానులు చాలా మందే ఉన్నారు. కానీ మే 14.. 2022.. ఆస్ట్రేలియా క్రికెట్‌లో పెను విషాదం నింపింది. ఎందుకంటే అదే రోజు 46 ఏళ్ల వయసులో ఆండ్రూ సైమండ్స్‌ భౌతికంగా దూరమయ్యాడు. టౌన్స్‌విల్లే నగరం బయట జరిగిన యాక్సిడెంట్‌లో కారు తునకాతునకలు అవడంతో సైమండ్స్‌ మృతి చెందినట్లు పోలీసులు దృవీకరించారు. అయితే అంతకముందే ఆసీస్‌ స్పిన్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌ కూడా గుండెపోటుతో మరణించడం.. ఇలా రెండు నెలల వ్యవధిలోనే ఇద్దరు క్రికెటర్లు దూరమవడం ఆసీస్‌ అభిమానులను కలచివేసింది.


Photo Credit: Getty Images

ఇక విషయంలోకి వెళితే.. ఆస్ట్రేలియా, జింబాబ్వే మధ్య మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ జరగనుంది. కాగా ఆదివారం ఆసీస్‌, జింబాబ్వేలు తొలి వన్డే ఆడనున్నాయి. ఈ మ్యాచ్‌ ఆండ్రూ సైమండ్స్‌ స్వస్థలమైన టౌన్స్‌విల్లేలో జరగనుంది. దీంతో మ్యాచ్‌ ప్రారంభానికి ముందు ఆండ్రూ సైమండ్స్‌కు ఘన నివాళి ప్రకటించనుంది. ఈ కార్యక్రమంలో ఇరుజట్ల ఆటగాళ్లతో పాటు సైమండ్స్‌ భార్య, పిల్లలు, క్రికెట్‌ ఆస్ట్రేలియా అధికారులు పాల్గొననున్నారు. కాగా ఈ సిరీస్‌లో మూడు వన్డేలు టౌన్స్‌విల్లే వేదికగానే జరగనున్నాయి.


Photo Credit: Getty Images

ఇక 1998లో ఆస్ట్రేలియా తరపున సైమండ్స్‌ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. తన కెరీర్‌లో 26 టెస్టులు, 198 వన్డేలు, 14 టీ20ల్లో ఆస్ట్రేలియాకు ప్రాతినిద్యం వహించాడు. 2003, 2007 వన్డే వరల్డ్‌ కప్‌ను ఆస్ట్రేలియా గెలుచుకోవడంలో సైమండ్స్‌ కీలక పాత్ర పోషించాడు. 

చదవండి: Andrew Symonds: అంతర్జాతీయ క్రికెట్‌ గ్రౌండ్‌కు ఆండ్రూ సైమండ్స్ పేరు..!

Andrew Symonds: కన్నీరు తెప్పిస్తున్న ఆండ్రూ సైమండ్స్‌ సోదరి లేఖ

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top