IND-w vs AUS-W: ఆస్ట్రేలియాతో తొలి టీ20.. బ్యాటింగ్‌ భారత్‌దే! కర్నూలు అమ్మాయి ఎంట్రీ

Alyssa Healy wins toss, India batting first in 1st T20 - Sakshi

ముంబై వేదికగా ఆస్ట్రేలియా మహిళలలతో తొలి టీ20లో తలపడేందుకు భారత జట్టు సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. కాగా గత కొంత కాలంగా జట్టుకు దూరంగా భారత బ్యాటర్‌ దేవికా వైద్యకు తుది జట్టలో చోటు దక్కింది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అంజలి శర్వణి భారత తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేయనుంది.

ఇక ఈ సిరీస్‌కు ఆస్ట్రేలియా రెగ్యూలర్‌ కెప్టెన్‌ లానింగ్‌ దూరం కావడంతో హీలీ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహిస్తుంది. కాగా భారత పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా జట్టు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడనుంది.

తుది జట్లు
ఆస్ట్రేలియా: అలిస్సా హీలీ(కెప్టెన్‌), బెత్ మూనీ, తహ్లియా మెక్‌గ్రాత్, ఆష్లీ గార్డనర్, ఎల్లీస్ పెర్రీ, గ్రేస్ హారిస్, అన్నాబెల్ సదర్లాండ్, జెస్ జోనాసెన్, అలానా కింగ్, కిమ్ గార్త్, మేగాన్ షుట్

భారత జట్టు: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్‌), దేవికా వైద్య, రిచా ఘోష్(వికెట్‌ కీపర్‌), దీప్తి శర్మ, రాధా యాదవ్, అంజలి శర్వాణి, మేఘనా సింగ్, రేణుకా సింగ్
చదవండి: ENG vs PAK: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్‌.. 120 ఏళ్ల రికార్డు బద్దలు! ప్రపంచంలోనే తొలి జట్టుగా

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top