పదేళ్ల తర్వాత కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌లో బోపన్న 

After 10 Years Rohan Bopanna Again Reaches Career Best Rank - Sakshi

భారత టెన్నిస్‌ స్టార్‌ రోహన్‌ బోపన్న పదేళ్ల విరామం తర్వాత మళ్లీ కెరీర్‌ బెస్ట్‌ మూడో ర్యాంక్‌ కు చేరుకున్నాడు. సీజన్‌ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్‌లో రోహన్‌ బోపన్న (భారత్‌)–మాథ్యూ ఎబ్డెన్‌ (ఆస్ట్రేలియా) జోడీ సెమీఫైనల్లో నిష్క్రమించింది. 

ఈ ప్రదర్శనతో ఏటీపీ డబుల్స్‌ ర్యాంకింగ్స్‌లో బోపన్న మూడు స్థానాలు ఎగబాకాడు. 43 ఏళ్ల బోపన్న 2013లో చివరిసారి కెరీర్‌ బెస్ట్‌ మూడో ర్యాంక్‌లో నిలిచాడు. ఈ ఏడాది బోపన్న–ఎబ్డెన్‌ ద్వయం ఏడు టోర్నీల్లో ఫైనల్‌ చేరి రెండింటిలో టైటిల్‌ నెగ్గి, ఐదింటిలో రన్నరప్‌గా నిలిచింది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top