కోహ్లి బ్యాట్స్‌ దొంగలిస్తా : డివిలియర్స్‌

AB de Villiers Jokes About Stealing Bats Of RCB Captain Virat Kohli - Sakshi

దుబాయ్‌ : విరాట్‌ కోహ్లి నేతృత్వంలోని ఆర్‌సీబీ ఐపీఎల్‌ 13వ సీజన్‌లో మంచి ప్రదర్శన కనబరుస్తుంది. ఆడిన 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. తాజాగా కోహ్లి వాడుతున్న బ్యాట్స్‌తో పాటు కొత్త కిట్‌కు సంబంధించి బోల్డ్‌ డైరీస్‌ పేరిట ఆర్‌సీబీ యూట్యూబ్‌ చానెల్‌లో ఒక వీడియోను షేర్‌ చేసింది. ఆ వీడియోలో విరాట్‌ కోహ్లి తన కిట్స్‌ గురించి క్లియర్‌ కట్‌గా వివరించాడు. (చదవండి : కనీసం కొట్టే అవకాశం కూడా ఇస్తలేవు)

'ఐపీఎల్‌ అనే కాదు.. ఏ టూర్‌కు సన్నద్దం కావాల్సి వచ్చినా  బ్యాట్‌ దగ్గర్నుంచి ప్యాడ్స్‌ వరకు కొత్త కిట్‌ను కచ్చితంగా వాడుతుంటా. నా దృష్టిలో టెస్టు క్రికెట్‌కు అత్యధిక ప్రాధాన్యమిస్తా.. అందుకే టెస్టులకు వాడే కిట్‌ను వన్డే, టీ20ల్లో ఉపయోగించను. తాజాగా ఐపీఎల్‌ 13వ సీజన్‌ దుబాయ్‌లో చాలా వేడి ఉండడంతో దానికి తగ్గట్టుగానే సిద్దమయ్యా. దుబాయ్‌లె వేడి అధికంగా ఉన్న కారణంతో 10 జతల గ్లోవ్స్‌ వాడాల్సి వస్తుంది. నా బ్యాట్‌ కిట్‌లో అన్ని వస్తువులకు సమప్రాధాన్యం ఇస్తుంటా. గ్లోవ్స్‌ వేసుకోవడానికి ముందు ఒక స్పెషల్‌ క్రీమ్‌ అప్లై చేస్తా.. దాని వల్ల నా చేతికి గ్రిప్‌ వచ్చి బ్యాటింగ్‌ ఇంకా బాగా చేయగలుగుతున్నా. అంతేగాక ప్రాక్టీస్‌ సమయంలో మూడు రకాల బ్యాట్లను వాడడంతో పాటు ఒకే కిట్‌లో మూడు పెట్టేంత ప్లేస్‌ను ఏర్పాటు చేసుకున్నా.' అంటూ చెప్పుకొచ్చాడు.

అయితే కోహ్లి సీరియస్‌గా మాట్లాడుతున్న సమయంలో ఏబీ డివిలియర్స్‌ మధ్యలో కల్పించుకొని కోహ్లి తన బ్యాట్లను ఎవరికి తెలియకుండా సీక్రెట్‌గా దాస్తుంటాడని.. వాటిని ఎలాగైనా దొంగలించే ప్రయత్నం చేస్తానని పేర్కొన్నాడు. డివిలియర్స్‌ మాటలతో కోహ్లి చిరునవ్వులు చిందించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. (చదవండి : ఏందిది.. ధోనికి అంపైర్‌ భయపడ్డాడా?)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top