కనీసం కొట్టే అవకాశం కూడా ఇస్తలేవు : యూవీ

Yuvraj Singh Praises Yuzvendra Chahal In Different Way - Sakshi

షార్జా : ఐపీఎల్‌ 13వ సీజన్‌లో ఆర్‌సీబీ వరుసగా రెండు విజయాలు నమోదు చేసి మంచి జోరులో ఉంది. తాజాగా సోమవారం కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 82 పరుగుల తేడాతో మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఆర్‌సీబీ విజయాల్లో స్పిన్నర్‌ యజ్వేంద్ర చహల్‌ కీలకపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్టు బలపడుతుందన్న సమయంలో బౌలింగ్‌కు వస్తున్న చహల్‌ కీలక వికెట్లు తీసి జట్టుకు విజయాలందిస్తున్నాడు. కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఆ జట్టు కెప్టెన్‌ దినేష్‌ కార్తీక్‌ వికెట్‌ తీసి ఆర్‌సీబీకి మంచి బ్రేక్‌ ఇచ్చాడు.చహల్‌ ఈ మ్యాచ్‌లో తీసింది ఒక వికెట్‌ మాత్రమే అయినా.. 4ఓవర్లలో 12 పరుగులిచ్చి ఆకట్టుకున్నాడు. (చదవండి : కోహ్లి.. ఇది ఓవరాక్షన్‌ కాదా?)

ఈ సందర్భంగా టీమిండియా మాజీ డాషింగ్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ చహల్‌ను వినూత్న రీతిలో ప్రశంసించాడు. చహల్‌.. నీ బౌలింగ్‌లో ప్రత్యర్థి బ్యాట్స్‌మన్లకు కనీసం కొట్టే అవకాశం కూడా ఇస్తలేవు.. ఒక ఓవర్‌ మొత్తం మెయిడెన్‌ వేసి ఆకట్టుకున్నావు. నీ నుంచి ఇవాళ ఒక గ్రేట్‌ స్పెల్‌ చూశా.. వెల్‌డన్‌ యుజీ అంటూ కామెంట్స్‌ చేశాడు. చహల్‌ ఈ సీజన్‌లో 7 మ్యాచులాడి 7.07 ఎకానమితో 10 వికెట్లు తీశాడు. కేకేఆర్‌పై విజయం ద్వారా ఆర్‌సీబీ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. కాగా ఆర్‌సీబీ తన తర్వాతి మ్యాచ్‌ అక్టోబర్‌ 15న కింగ్స్‌ పంజాబ్‌తో షార్జా వేదికగా తలపడనుంది.(చదవండి : కొడితే బంతి బయటపడాల్సిందే)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top