వైరల్‌ వీడియో.. ఖచ్చితంగా లాయర్‌ అవుతావు | Viral Video of Little Girl Explaining Why She Hit Her Brother | Sakshi
Sakshi News home page

వైరల్‌ వీడియో.. ఖచ్చితంగా లాయర్‌ అవుతావు

Oct 20 2020 11:37 AM | Updated on Oct 20 2020 1:00 PM

Viral Video of Little Girl Explaining Why She Hit Her Brother - Sakshi

తోబుట్టువుల మధ్య అనుబంధం చాలా అందమైన విషయం. వారు ఒకరినొకరు ప్రేమిస్తారు, రక్షించుకుంటారు, వారు తమ రహస్యాలు అన్నీ పంచుకుంటారు. అలానే కొన్ని సార్లు బాగా దెబ్బలాడుకుంటారు. ఎంత పెద్ద గొడవ జరిగినా వెంటనే కలిసి పోతారు. పెద్దవాళ్లయ్యాక తెలియదు కానీ బాల్యంలో మాత్రం ఇలానే ఉంటారు. ఈ నేపథ్యంలో అన్నాచెల్లెలి పోట్లాటకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది.

దీన్ని చూసిన వారంతా తమ బాల్య స్మృతులను నెమరు వేసుకుంటున్నారు. చిన్నారులను దీవిస్తున్నారు. ఈ వీడియోలో ఒక పదేళ్ల బాలిక తన సోదరుడిని ఎందుకు కొట్టాల్సి వచ్చిందో తన తల్లికి వివరిస్తుంది. దానిలో భాగంగా ఆ చిన్నారి చెప్పే కారణాలు, పలికించే భావాలు నెటిజనులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. 53 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో ఆ చిన్నారి తన సోదరుడిని ఉద్దేశించి ‘మలాకీ నన్ను కొట్టాడు.. అతను నన్ను ఒంటరిగా వదిలేయడం లేదు కాబట్టి నేను అతనితో పోరాడటం మొదలుపెట్టాను. నేను ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను’ అని తెలియజేస్తుంది. ( వైర‌ల్‌: మందు కోసం పిల్లోడిని ప‌డేసింది)

నెటిజనులకు ఈ వీడియో తెగ నచ్చింది. ఇప్పటికే దీన్ని 24.7 కే మంది చూడగా.. వేల మంది రీట్వీట్‌ చేశారు. ఇక మాజీ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు రెక్స్ చాప్మన్‌కి కూడా తెగ నచ్చింది. అలానే కొందరు ట్విట్టర్ యూజర్లు ‘పెద్దయ్యాక ఖచ్చితంగా లాయర్‌ అవుతారు..  చిన్నారిని లా చదివించండి.. తెగ వాదిస్తోంది’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement