కనబడని చెయ్యేదో ఆడిస్తున్న ఆటబొమ్మలం... తోలుబొమ్మలం | Life in plastic, not fantastic: This video about how dolls are made will oddly give you chills | Sakshi
Sakshi News home page

కనబడని చెయ్యేదో ఆడిస్తున్న ఆటబొమ్మలం... తోలుబొమ్మలం

Aug 20 2023 3:59 AM | Updated on Aug 20 2023 3:59 AM

Life in plastic, not fantastic: This video about how dolls are made will oddly give you chills - Sakshi

‘రంగ రంగ రంగస్థలానా... కనబడని చెయ్యేదో ఆడిస్తున్న ఆటబొమ్మలం అంటా...తోలు బొమ్మలం అంటా’ అంటూ ‘రంగస్థలం’లో తాత్వికంగా పాడతాడు రామ్‌చరణ్‌. ఈ పాట సంగతి ఎలా ఉన్నా ‘బొమ్మలు మన కుటుంబ సభ్యులు’ అంటున్నాడు ఆలిఫ్‌. కోల్‌కతాకు చెందిన వ్లోగర్‌ ఆలిఫ్‌ బొమ్మలు తయారుచేసే కార్మికుల వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు.

లిక్విడ్‌ ప్లాస్టిక్‌ను వివిధ రకాల బొమ్మల మూసలలో పోయడం నుంచి బొమ్మల తలలకు ప్లాస్టిక్‌ వెంట్రుకలు అతికించడం వరకు రకరకాల దశలు ఈ వీడియోలో కనిపిస్తాయి. ‘లైఫ్‌ ఇన్‌ ప్లాస్టిక్‌ నాట్‌ ఫంటాస్టిక్‌’ అంటూ ఒక యూజర్‌ స్పందించాడు. ‘అందమైన బొమ్మల వెనుక ఇంత కష్టం ఉంటుందా!’ అని చెప్పేలా ఉన్న ఈ వీడియో వైరల్‌ అయింది.

Advertisement
 
Advertisement
Advertisement