నాగిని డ్యాన్సర్లకు ముచ్చెమటలు.. డాల్ఫిన్‌ డ్యాన్స్‌ | Dolphin Dance Video Viral In Social Media | Sakshi
Sakshi News home page

ఇలాంటి డ్యాన్స్‌.. మైకేల్‌ జాక్సన్‌ చేసుండడు.. ఏ సినిమాలో చూసుండరు!

Jan 27 2022 8:19 PM | Updated on Jan 27 2022 8:47 PM

Dolphin Dance Video Viral In Social Media - Sakshi

డ్యాన్సింగ్‌ అంకుల్‌గా ఇండియా వైడ్‌గా పాపులరైన సంజీవ్‌ శ్రీవాత్సవనే మరిపించేలా మరో డ్యాన్సర్‌ సోషల్‌ మీడియాలో హైలెట్‌ అయ్యాడు. నార్త్‌లో బాగా పాపులరైన పాప్‌ సింగర్‌ సప్నా చౌదురి పాడిన మేరి జిందగి మే ఆకే మేరా దిల్‌ కా చేన్‌ చురాయా పాటకి ఈ డ్యాన్సర్‌ వేసిన స్టెప్పులు నభూతో నభవిష్యత్‌ అన్నట్టుగా ఉన్నాయి. చూడటానికి నవ్వు తెప్పించేలా ఉన్నా ఎంతో కష్టమైన స్టెప్పుని సునాయాసంగా వేశాడీ డ్యాన్సర్‌. 

ఈ వీడియోలో కనిపించే ప్రోగ్రామ్‌ ఎక్కడ జరిగింది ? ఆ డ్యాన్సర్‌ ఎవరూ అనే వివరాలపై స్పష్టత ఇంకా రాలేదు. కానీ డ్యాన్స్‌ మాత్రం నెటిజన్లు విపరీతంగా ఆకట్టుకుంటోంది. నాగిని, తీన్మార్‌ డ్యాన్స్‌ల తరహాలో కిక్కెస్తున్న ఈ నృత్యాన్ని డాల్ఫిన్‌ డ్యాన్స్‌గా నెటిజన్లు పిలుచుకుంటున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement