హరీశ్‌రావుపై అసత్య ప్రచారాలు తగవు | - | Sakshi
Sakshi News home page

హరీశ్‌రావుపై అసత్య ప్రచారాలు తగవు

Nov 14 2026 7:57 AM | Updated on Nov 14 2026 7:57 AM

సిద్దిపేటజోన్‌: సీఎం రేవంత్‌రెడ్డి, తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత ఇద్దరి పయనం ఒక్కటేనని, ఎమ్మెల్యే హరీశ్‌రావు పైన ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచారాలు చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు మహేశ్‌ అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సిద్దిపేట ప్రాంతంలో ఇద్దరి పర్యటన యాదృచ్చికంగా లేదని, ఉద్దేశపూర్వకంగా ఉందన్నారు. సిద్దిపేట అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న హరీశ్‌రావుపై కవిత అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ప్రజలకు అందుబాటులో ఉండేలా సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయం నిర్మిస్తే దాన్ని రాజకీయం చేయడం విడ్డురంగా ఉందన్నారు. తెలంగాణ వాదులను చీల్చడానికే తెలంగాణ రక్షణ సేన ఏర్పాటు అయ్యిందని ఆరోపించారు. హరీష్‌ రావు మీద అవాకులు చెవాకులు సరికాదన్నారు.ఈ సమావేశంలో నాయకులు యాదగిరి, శ్రీనివాస్‌ రెడ్డి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement