సముచిత పరిహారం చెల్లించాలి | - | Sakshi
Sakshi News home page

సముచిత పరిహారం చెల్లించాలి

Nov 14 2026 7:57 AM | Updated on Nov 14 2026 7:57 AM

సముచిత పరిహారం చెల్లించాలి రోగులకు సకాలంలో వైద్య సేవలు నేటి నుంచి గ్రంథాలయ వారోత్సవాలు చిన్నప్పుడే లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలి

ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌కు రైతుల వినతి

సిద్దిపేటజోన్‌: రెండు గ్రామాల్లో 140 ఎకరాల భూమి సేకరణకు సంబంధించి సముచిత పరిహారం చెల్లించాలని రైతులు శుక్రవారం స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ విజయలక్ష్మికి ఆయా గ్రామాల రైతులు వినతిపత్రాన్ని సమర్పించారు. నియోజకవర్గ పరిధిలోని తడ్కపల్లి, వెంకటపూర్‌ గ్రామాల్లో అదనపు టీఎంసీ పారాలాల్‌ కాలువ కోసం భూసేకరణతో భూములు కోల్పోతున్న రైతులు ఆర్డీవో కార్యాలయంలో డిప్యూటీ కలెక్టర్‌ను కలిసి సమస్య వివరించారు. హుస్నాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని గౌరవెల్లిలో ఎకరాకు రూ.18 లక్షలు, కొడంగల్‌ ప్రాంతంలో రూ.21లక్షలు పరిహారం చెల్లిస్తున్నారని, ఇక్కడ మాత్రం రూ.14.50లక్షలు ఇచ్చి వివక్ష చూపే ప్రయత్నాలు చేస్తున్నారని రైతులు ఆరోపించారు.

ఎన్‌సీడీ రాష్ట్ర జాయింట్‌ డైరెక్టర్‌ కరుణశ్రీ

ములుగు(గజ్వేల్‌): రక్తపోటు(బీపీ), మధుమేహం(షుగర్‌)వంటి అసంక్రమిత వ్యాధుల(ఎన్‌సీడీ)ను ముందస్తుగా గుర్తించి బాధితులకు సకాలంలో వైద్యసేవలు అందించాలని ఎన్‌సీడీ రాష్ట్ర జాయింట్‌ డైరెక్టర్‌ కరుణశ్రీ స్పష్టం చేశారు. ములుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కరుణశ్రీతోపాటు జిల్లా ఎన్‌సీడీ ప్రోగ్రామ్‌ అధికారి వినోద్‌బాబ్జి, కన్సల్టెంట్‌ అబ్దుల్‌ నసీమ్‌ శుక్రవారం సందర్శించి కార్యక్రమం అమలు తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్‌సీడీ కార్యక్రమానికి సంబంధించిన వైద్య సేవలు, రోగుల గుర్తింపు, పరీక్షలు, రికార్డుల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఎన్‌సీడీ కార్యక్రమంపై అవగాహన కల్పి స్తూ అర్హులైన వారందరికీ అవసరమైన ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని తెలిపారు.

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ దరిపల్లి చంద్రం

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): జాతీయ గ్రంథాలయ 59వ వారోత్సవాలు శనివారం నుంచి నిర్వహించనున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ దరిపల్లి చంద్రం వెల్లడించారు. ఈ వారోత్సవాల్లో భాగంగా ప్రతీ రోజు ఒక కార్యక్రమం నిర్వహించనున్నట్లు శుక్రవారం మీడియాకు తెలిపారు. శనివారం చిత్రలేఖన పోటీలు, ఆదివారం పుస్తక ప్రదర్శన, సోమ వారం క్విజ్‌ పోటీలు, మంగళవారం పదవీ విరమణ పొందిన గ్రంథ పాలకులకు సన్మానం, కవి సమ్మేళనం, బుధవారం వ్యాసరచన పోటీ లు, గురువారం మహిళా దినోత్సవం, ముగ్గుల పోటీలు, శుక్రవారం సాంస్కృతిక కార్యక్రమాలు, విజేతలకు బహుమతుల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

హాజరైన జిల్లా న్యాయ సేవాధికార

సంస్థ కార్యదర్శి సౌజన్య

సిద్దిపేటరూరల్‌: బాలలు చిన్నతనం నుంచి మంచి లక్ష్యాలను అలవర్చుకుని వాటి సాధనకై ముందుకు సాగాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని మీటింగ్‌ హాల్‌లో శుక్రవారం జిల్లా సంక్షేమ శాఖ, జిల్లా శిశు సంరక్షణ విభాగం సిద్దిపేట ఆధ్వర్యంలో నిర్వహించిన బాలల దినోత్సవానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య హాజరై మాట్లాడారు. బాలలు చిన్ననాటి నుంచే లక్ష్యాన్ని ఏర్పరచుకుని ఆ లక్ష్యసాధన దిశగా కలలుకంటూ ఆ కలని సాకారం చేసుకోవాలని చెప్పారు. చిన్నారులతో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఆటలపోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు అధికారులు బహుమతులు అందజేశారు. బాలల సంక్షేమ సమితి సభ్యు లు నరసింహులు, మంజుల, అంజమ్మ, జిల్లా బాలల పరిరక్షణ అధికారి రాము, ఆశ్రితా స్వచ్ఛంద సేవ సంస్థ కో ఆర్డినేటర్‌ పర్వతాలు, శిశు సంరక్షణ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement