గౌరవెల్లి కాలువల భూ సేకరణ వేగిరం | - | Sakshi
Sakshi News home page

గౌరవెల్లి కాలువల భూ సేకరణ వేగిరం

Nov 8 2026 10:18 AM | Updated on Nov 8 2026 10:18 AM

హుస్నాబాద్‌: గౌరవెల్లి రిజర్వాయర్‌ కాలువల భూ సేకరణ వేగవంతం చేయాలని, సేకరణ పూర్తయిన భూమిని స్వాధీనం చేసుకుని నీటి పారుదల శాఖకు అప్పగించాలని కలెక్టర్‌ హైమావతి అధికారులను ఆదేశించారు. హుస్నాబాద్‌ మున్సిపల్‌ కార్యాలయంలో శనివారం హుస్నాబాద్‌, అక్కన్నపేట, కోహెడ మండలాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులపై ఆయా మండలాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ హైమావతి మాట్లాడుతూ...కాలువల పనులు చేపట్టే వరకు రైతులు పంటలు వేయకుండా ఫెన్సింగ్‌ చేసుకోవాలని ఇరిగేషన్‌ అధికారులను ఆదేశించారు. ఎల్‌నినో ప్రభావం వల్ల వేసవిలో పశువులకు పశుగ్రాసం కోసం నీరు అందుబాటులో ఉన్న చెరువులు, కుంటల శిఖం భూములను గుర్తించాలన్నారు. ఒక్కో చెరువు పరిధిలో 5 నుంచి 10 ఎకరాల వరకు పశుగ్రాసం సాగు చేసేందుకు ప్రణాళిక చేయాలన్నారు. వీబీజీ రామ్‌జీ ద్వారా గడ్డి పెంపకం చర్యలు చేపట్టాలన్నారు. యంగ్‌ ఇండియా రెసిడెన్షియల్‌ స్కూల్‌ పనులు 50% పూర్తయ్యాయని, మిగిలిన పనులను అకాడమీ వరకు పూర్తి చేయాలన్నారు. ఇంజనీరింగ్‌ కళాశాల నిర్మాణ పనులు నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాలని ఆదేశించారు. హుస్నాబాద్‌ పట్టణంలో 250 పడకల ఆస్పత్రి పనులు నత్తనడకన సాగుతున్నాయని, వేగం పెంచి సకాలంలో పూర్తి చేయాలన్నారు. హుస్నాబాద్‌ నుంచి కొత్తపల్లి వరకు నాలుగు వరుసల రహదారి నిర్మాణ పనులను పలు శాఖల అధికారుల సమన్వయంతో రోడ్డు పనులు చేపట్టాలన్నారు.

అధికారులకు కలెక్టర్‌ హైమావతి ఆదేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement