కన్యకా పరమేశ్వరికి లక్ష పుష్పార్చన | - | Sakshi
Sakshi News home page

కన్యకా పరమేశ్వరికి లక్ష పుష్పార్చన

Nov 4 2026 8:04 AM | Updated on Nov 4 2026 8:04 AM

కన్యకా పరమేశ్వరికి లక్ష పుష్పార్చన కరువు మండలాలుగా గుర్తించండి చేనేత సమస్యలపై మంత్రికి వినతి రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా చైర్మన్‌గా నరేశ్‌బాబు 6న సాంస్కృతిక పోటీలు

దుబ్బాక: పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవికి లక్ష పుష్పార్చన ఘనంగా నిర్వహించారు. ఆలయం 17వ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం వేదపండితులు వేలిటి జయరామశర్మ, రామకృష్ణశర్మ ఆధ్వర్యంలో విశేష పూజలు చేశారు. కార్యక్రమంలో వైశ్య సంఘం అధ్యక్షుడు చింత నాగేందర్‌, కార్యదర్శి పడమటింటి రాజు, కోషాధికారి చింత ఉమామహేశ్వర్‌, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సీఎంకు మంత్రి పొన్నం లేఖ

హుస్నాబాద్‌: నియోజకవర్గంలోని మూడు మండలాలను కరువు మండలాలుగా గుర్తించాలని మంగళవారం సీఎం రేవంత్‌ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్‌ విజ్ఞప్తి చేశారు. ఎల్‌నినో ప్రభావంతో హుస్నాబాద్‌, అక్కన్నపేట, కోహెడ మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని సీఎంకు మంత్రి లేఖ రాశారు. వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం పడటంతో పాటు రానున్న రోజుల్లో తాగునీటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని మంత్రి తన లేఖలో పేర్కొన్నారు. ఈ మూడింటిని కరువు మండలాలుగా ప్రకటించాలని కోరుతూ ఆయా మండలాలు, గ్రామాల్లో ప్రజలు ఏకగ్రీవంగా తీర్మానాలు చేస్తున్నారని తెలిపారు.

సిద్దిపేటజోన్‌: చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, సంక్షేమం కోసం ప్రత్యేక కార్యచరణ చేపట్టాలని సిటిజన్‌ రైట్స్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో మంగళవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు వినతిపత్రాన్ని అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది చేనేత పరిశ్రమ మీద ఆధారపడి ఉన్నారని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులు, ఉపాధి అవకాశాల కొరత, ప్రభుత్వ సంక్షేమ పథకాలలో లోపాలు, చేనేత రంగంలో అవినీతి అక్రమాలు తదితర అంశాలపై వారు మంత్రికి వివరించారు. మంత్రిని కలిసిన వారిలో కౌన్సిల్‌ ఫౌండర్‌ శివచంద్ర, రాష్ట్ర చేనేత విభాగం అధ్యక్షుడు రవితేజ తదితరులు ఉన్నారు.

గజ్వేల్‌: ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సోసైటీ జిల్లా శాఖ చైర్మన్‌గా గజ్వేల్‌ పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యుడు నరేష్‌బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్‌ చైర్మన్‌గా బండారి విష్ణుకాంత్‌, కోశాధికారిగా కస్తూరి భూంరెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులుగా అయిత బాల్‌రాజేశంలు ఎన్నికయ్యారు. మంగళవారం సిద్దిపేట కలెక్టరేట్‌ కార్యాలయంలో అదనపు కలెక్టర్‌ సమక్షంలో నరేష్‌బాబు బాధ్యతలు స్వీకరించారు.

సిద్దిపేటజోన్‌: స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈనెల 6న జిల్లా స్థాయి సాంస్కృతిక పోటీలు నిర్వహించనున్నట్టు జిల్లా యువజన సంక్షేమ, క్రీడల శాఖ అధికారి వీరారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో ఉదయం 9గంటల నుంచి పోటీలు జరగనున్నట్టు తెలిపారు. 15ఏళ్ల నుంచి 29 ఏళ్ల లోపు యువతి యువకులు పాల్గొనాలని సూచించారు. జానపద, పెంటింగ్‌, కవిత్వ రచన అంశాల్లో పోటీలు ఉంటాయన్నారు. ఎంపికై న వారికి రాష్ట్ర స్థాయి పోటీల్లో అవకాశం ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు 9014580816, 7780577861 నంబర్లు సంప్రదించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement