మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులు
తొగుట(దుబ్బాక): కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. పెద్దపల్లి, గోదావరిఖని పట్టణాల బీఆర్ఎస్ నాయకులు ఉప్పు రాజ్‌కుమార్, బొడ్డు రవీందర్ ఆధ్వర్యంలో కన్నేపల్లి నుంచి కొండపోచమ్మ సాగర్ వరకు 400కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేపట్టారు. సైకిల్ యాత్ర మల్లన్న సాగర్ రిజర్వాయర్‌కు మంగళవారం చేరుకుంది. సైకిల్ యాత్రకు స్థానిక పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిస్థాయిలో పునరుద్ధరించి రైతులకు సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు పూర్తిస్థాయిలో చేపట్టి కన్నెపల్లి పంపులను వెంటనే ప్రారంభించాలన్నారు. కేసీఆర్ మళ్లీ సీఎం అయితేనే రైతుల కష్టాలు తీరుతాయని వారు ఆశాభావం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో తొగుట మండల అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి, సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.


