మాది జగదేవ్‌పూర్ మండలం కొత్తపేట. వానాకాలంలో తొమ్మిది ఎకరాల్లో వరి, పత్తి సాగు చేశా. రెండు బోర్లున్నా ఇపుడే సన్నగా పోస్తున్నాయి. దీంతో యాసంగిలో సాగునీటి తిప్పలు తప్పేట్లు లేవు. మా ఊర్లో సాగుపై చర్చ జరుగుతోంది. పొద్దుతిరుగుడు పంట వేయాలనుకుంటున్నా.
–దేవేందర్‌రెడ్డి, రైతు,
కొత్తపేట, జగదేవ్‌పూర్ మండలం
కరెంట్ సరిగా వస్తలేదు
మా ఊర్లో బురుజు దగ్గర యాసంగి సాగుపైనే రైతుల మధ్య ముచ్చట నడుస్తోంది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక చెరువుల్లో నీరు లేదు. బోర్లు, బావుల్లో సైతం నీరు అంతంతే. యాసంగిలో నీటి, కరెంట్ కష్టాలు తప్పేట్లు లేవు.
–సంజీవరెడ్డి, రైతు, భైరాన్‌పల్లి, దూళ్మిట్ట మండలం


