●రైతుల్లో అంతర్మథనం ●ఎల్నినోతో యాసంగిపై గుబులు
●ఏ నలుగురు కలిసినా ఇదే చర్చ
‘వానలు సరిగ్గా పడకపాయే.. పంట పండకపాయె.. అదేదో ఎల్నినో అట.. యాసింగిలోనైనా పంట వేద్దామా? వద్దా? దేవన్నా’.. ‘ఏమోరా.. మా శీను చెబుతుండు.. వరి అయితే వేయకండి.. నీళ్లు అందవు.. కరెంటు సరిగ్గా ఉండదు.. ఇబ్బందులు ఏర్పడతాయని అంటుండు’. ఇది జిల్లాలోని రాఘవాపూర్లోని రైతులు దేవన్న, ఎల్లయ్య మధ్య జరిగిన సంభాషణ. ఇది కేవలం ఈ ఇద్దరి సంభాషణే కాదు.. ఏ ఇద్దరు, ముగ్గురు రైతులు కలిసినా ఇదే చర్చ జరుగుతోంది.


