దుబ్బాకను కరువు ప్రాంతంగా ప్రకటించాల్సిందే | - | Sakshi
Sakshi News home page

దుబ్బాకను కరువు ప్రాంతంగా ప్రకటించాల్సిందే

Nov 4 2026 8:04 AM | Updated on Nov 4 2026 8:04 AM

దుబ్బాక: ఇది కాంగ్రెస్‌ తెచ్చిన కరువు అని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు అన్నారు. మంగళవారం దుబ్బాక నియోజకవర్గంలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ జిల్లా ఉపాధ్యక్షులు గుండెల్లి ఎల్లారెడ్డి, మాజీ జెడ్పీటీసీ కడతల రవీందర్‌రెడ్డి, దుబ్బాక మున్సిపల్‌ అధ్యక్షులు ఇల్లందుల శ్రీనివాస్‌, వివిధ మండలాల అధ్యక్షులు మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేతగాని తనంతోనే కరువు ఏర్పడిందన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు భీమసేన, తీపిరెడ్డి మహేష్‌రెడ్డి, అంకం మధు, బండి రాజు, దేవుని రాజు, కిషన్‌రెడ్డి, ఖలీల్‌, భూపాల్‌, ప్రభాకర్‌, భాస్కర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement