● కలెక్టర్ హైమావతి
● క్షేత్రస్థాయిలో పరిశీలన
బెజ్జంకి(సిద్దిపేట): భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకే భూ భారతి రీసర్వే కార్యక్రమం చేపడుతున్నామని కలెక్టర్ హైమావతి తెలిపారు. మండలంలోని వీరాపూర్‌లో నిర్వహిస్తున్న భూరీ సర్వే కార్యక్రమాన్ని మంగళవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రీ సర్వేలో రైతుల అనుమానాలను అధికారులు నివృత్తి చేయాలన్నారు. భూసమస్యలు లేని గ్రామాలను తీర్చిదిద్దేందుకు ముందుగా చిన్న గ్రామాలను ఎంపిక చేశామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీకాంత్, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
కామన్ డైట్ మెనూ తప్పనిసరి
ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజనంలో కామన్ డైట్ మెనూ తప్పనిసరిగా అమలు చేయాలని కలెక్టర్ హైమావతి స్పష్ట చేశారు. బెజ్జంకి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మెనూ ప్రకారం వడ్డిస్తున్నారా? లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన రుచికరమైన భోజనాన్ని అందించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీకాంత్, సర్పంచ్ శ్రీధర్ తదతరులు పాల్గొన్నారు.


