అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలి

Nov 3 2026 8:19 AM | Updated on Nov 3 2026 8:19 AM

కోహెడరూరల్‌(హుస్నాబాద్‌): మండలంలోని ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో కాంగ్రెస్‌ కార్యకర్తలకే ప్రాధాన్యత ఇస్తూ రాజకీయ పక్షపాతం చూపుతున్నారని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ జేఏసీ జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్‌ వెల్పుల జయశంకర్‌ ఆరోపించారు. సోమవారం బాధితులతో కలిసి ఆయన ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు. నిజమైన నిరుపేదలను వదిలేసి, సొంత ఇళ్లు, కార్లు, ట్రాక్టర్లు ఉన్న పెత్తందారులకు ఇళ్లు కేటాయించడంపై ఆయన మండిపడ్డారు. స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్‌ దీనిపై తక్షణమే స్పందించి సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement