అక్కన్నపేట(హుస్నాబాద్): ఇంటింటికి నల్లా కనెక్షన్ ద్వారా భగీరథ తాగునీరు అందజేస్తామని భగీరథ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్(ఈఈ) నర్సింహులు అన్నారు. అక్కన్నపేట మండలం సేవాలాల్ మహారాజ్‌తండాలో నల్లా కనెక్షన్ పైపులైన్ నిర్మాణ పనులను ప్రారంభించి, పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్‌నీవో ప్రభావంతో భూగర్భజలాలు అడుగంటిపోయాయన్నారు. నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ రుహినా , ఏఈ హారీశ్, సర్పంచ్ జరుపుల సునీత, నాయకులు రాజునాయక్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


