సిద్దిపేటకమాన్: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పోలీసు కమిషనరేట్ పరిధిలోని పోలీసు కానిస్టేబుళ్ల కుటుంబాలకు ఇన్సూరెన్స్ పరిహార చెక్కులను సీపీ రష్మీ పెరుమాళ్ అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ఉండగా మరణించిన కానిస్టేబుళ్లు పరంధాములు, వెంకటేశం, నవీన్‌కుమార్ కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రాష్ట్ర పోలీసు సంక్షేమ విభాగం నుంచి మంజూరైన రూ.5.10 లక్షల చెక్కును అందజేసినట్లు తెలిపారు. వారి కుటుంబాలకు పోలీసుశాఖ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో సీపీ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


