గజ్వేల్: నియోజకవర్గాన్ని కరువు జాబితాలో చేర్చి, సహాయక చర్యలు చేపట్టాలని ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం గజ్వేల్‌లోని ఆర్‌డీఓ కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజావాణి’లో బీఆర్‌ఎస్ శ్రేణులతో కలిసి అధికారులకు ప్రతాప్‌రెడ్డి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కరువు మండలాల ఎంపిక సక్రమంగా జరగలేదని ఆరోపించారు. నియోజకవర్గంలో ప్రస్తు తం ప్రకటించిన కరువు మండలాలతోపాటుగా గజ్వేల్, జగదేవ్‌పూర్, కుకునూర్‌పల్లి, కొండపాక మండలాలను సైతం కరువు జాబితాలో చేర్చాలన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.


